Guess The Actress : కొన్ని అద్భుతమైన చిత్రాలను మనం ఎప్పటికీ మరచిపోలేము. భాషతో సంబంధం లేకుండా ఎగబడి మరీ చూస్తుంటాము, అలాంటి అద్భుతమైన

ఇండియా కి వచ్చిన ఒక పాకిస్తాన్ అమ్మాయి, తన కూతురు ‘మున్నీ’ ని తప్పిపోతోంది. మున్నీ ఇండియా లో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ సల్మాన్ ఖాన్ కి చిక్కుతుంది. కొంతకాలం తమ కుటుంబం లో ఒకరిగా పెంచుకున్న సల్మాన్ ఖాన్ ఎలా అయినా మున్నీ ని తన తల్లి దగ్గరకు చేర్చాలని చూస్తాడు.ఒక ట్రావెల్ ఏజెన్సీ తో మాట్లాడి, మున్నీ ని తన సొంత ఊరికి పంపే ప్రయత్నం చేస్తాడు,కానీ ఆ ట్రావెల్ ఏజెన్సీ అతను మున్నీ ని వ్యభిచార కూపం లో అమ్మేసేదానికి తీసుకొస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ అతనిని బాగా కొట్టి, మున్నీ ని స్వయంగా తానే పాకిస్తాన్ కి వెళ్లి తన తల్లి దగ్గరకు చేర్చడానికి పయనం అవుతాడు. ఆ మధ్యలో జరిగిన సంఘటనలు ఎదురైనా పరిస్థితులే సినిమా.

ఈ చిత్రం మున్నీ గా నటించిన అమ్మాయి పేరు హర్షాలీ మల్హోత్రా. అమాయకమైన ముఖం తో, క్యూట్ ఎక్సప్రెషన్స్ తో, మూగ అమ్మాయిగా ఈ సినిమాలో ఆ చిన్నారి నటించిన తీరు అద్భుతం. అంత చిన్న వయస్సు లో ఇంత అద్భుతంగా నటించడం ఎలా సాధ్యం అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమాలో అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గాను, హర్షాలీ కి ఫిలిం ఫేర్ అవార్డు కూడా దక్కింది.కానీ ఎందుకో ఈ చిన్నారి ఆ సినిమా తర్వాత మళ్ళీ ఎలాంటి సినిమాల్లోనూ కనపడలేదు.

ఈ చిత్రానికి ముందే ఆమె ‘క్కుబాల్ హాయ్’ , ‘లౌట్ ఆవో త్రిష’, ‘సావదాన్ ఇండియా’ వంటి టెలివిజన్ సీరియల్స్ లో నటించింది. ఆ సీరియల్స్ ద్వారా వచ్చిన ఫేమ్ తోనే ఆమె ‘భజరంగి భాయ్ జాన్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసే అవకాశం ని దక్కించుకుంది. సినిమాలకు దూరం గా ఉంటూ వచ్చినప్పటికీ కూడా ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది. ఒకప్పుడు అమాయకంగా చూస్తూ, ఎంతో చక్కగా నటించిన ఈ చిన్నారి ఇప్పుడు ఎంత హాట్ గా తయారైందో మీరే చూడండి.

