Guess The Actress : టాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీస్ లిస్ట్ ఒకసారి తీస్తే అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆర్య’ చిత్రం కచ్చితంగా ఉంటుంది.అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు.సుమారుగా ఆరోజుల్లోనే 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభ కి తోడుగా అల్లు అర్జున్ అద్భుతమైన నటన , మరి దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రాన్ని వేరే లెవెల్ కి తీసుకెళ్లి నిలబెట్టాయి.

అయితే ఈ చిత్రం లో అల్లు అర్జున్ తో పాటుగా చాలా మంది చిన్న పిల్లలు కనిపిస్తారు.వీళ్ళు సినిమా మొత్తం ఉంటారు, అందులో ఒక చిన్నారి శ్రావ్య గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము.ఈమధ్య కాలం లో బాలనటులుగా వచ్చిన ఆర్టిస్ట్స్ అందరూ హీరోలు గా హీరోయిన్లు గా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు.

అందులో శ్రావ్య కూడా ఒకరు,గత కొంతకాలం క్రితమే ఈమె ‘లవ్ యూ బంగారం’అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం తో శ్రావ్య కి సినిమాల్లో అవకాశాలు రాలేదు.చాలా కాలం అవకాశం కోసం ఎదురు చూసి విసుగెత్తిపోయిన ఈ ముద్దుగుమ్మ, సినిమాలకు టాటా చెప్పేసి అమెరికా లో స్థిరపడిపోయింది.అయితే సినిమాలకు దూరం అయ్యినప్పటికీ కూడా ఈమె సోషల్ మీడియా ద్వారా బాగా యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది.

రోజూ తనకి సంబంధించిన హాట్ వీడియోలను మరియు ఫోటోలను అప్లోడ్ చేస్తూ మంచి ఫాలోయింగ్ ని సంపాదించింది. ఆమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అనవసరంగా సినిమాలను వదిలి వెళ్ళిపోయింది.కొద్దీ రోజులు వేచి ఉంటే ఈమె స్టార్ డైరెక్టర్స్ దృష్టిలో పడేది అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.