Guess The Actor : ఒక్క హిట్.. పెళ్లి చేసుకో అంటూ 30వేల మంది అమ్మాయిలు.. ఇంతకీ ఎవరా హీరో ?

- Advertisement -


Guess The Actor : బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మహిళలకు ఆయనంటే పిచ్చి. తెలుగు ప్రేక్షకులకు కూడా హృతిక్ రోషన్ అంటే సుపరిచితమే. తన అందం, అభినయంతో ఎంతోమంది యువతలను ఫిదా చేసిన హృతిక్ రోషన్ ని మొదటి సినిమాలో చూసే చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసుకోమంటూ మ్యారేజ్ ప్రపోజల్స్ తీసుకొచ్చారన్న టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Guess The Actor
Guess The Actor

ఇక హృతిక్ తన కెరీర్ మొదట్లో బాల నటుడిగా నటించి తర్వాత కహోనా ప్యార్ హై అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కేవలం ఈ ఒక్క సినిమాకి హృతిక్ రోషన్‌కు చాలా మంది అమ్మాయిలు పడిపోయారు. అంతేకాదు మొదటి సినిమాతోనే హృతిక్‌ రోషన్ కు దాదాపు 30 వేల పెళ్లి ప్రపోజల్ వచ్చాయంటే ఆయన క్రేజ్ ఏంటో అర్థం అవుతోంది. అయితే హృతిక్ రోషన్ 12 ఏళ్ల వయసు నుంచే నటుడు సంజయ్ ఖాన్ కూతురు సుస్స‌నే ఖాన్‌తో మంచి స్నేహం గా ఉండేవారు.

Hrithik ROshan

అలా వీరి మధ్య ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. మొదట్లో వీళ్లు ప్రేమను ఒకరితో ఒకరు బయట పెట్టుకోకపోయినా.. పెళ్లి చేసుకునే నాలుగేళ్ల ముందు ప్రేమ విషయాన్ని బయట పెట్టుకున్నారు. ఇక 20 డిసెంబర్ 2000 లో హృతిక్ రోషన్ ఆమెను వివాహం చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఉంటూ ప్రేమించి.. పెళ్లి చేసుకున్న ఈ జంట ఏవో మనస్పర్ధల కారణంగా 2013 లో లీగల్ గా డివోర్స్ తీసుకుని విడిపోయారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here