Guess The Actress : సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. కానీ ఏనాడు కూడా తన తండ్రి పేరుని చెప్పుకొని అవకాశాలు సంపాదించే ప్రయత్నం చెయ్యలేదు. తన సొంత టాలెంట్ తోనే అవకాశాలు సంపాదించింది. దాదాపుగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోలందరితో నటించి ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకుంది.

తెలుగు లో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ ఇలా నేటి స్టార్ హీరోలతోనే కాకుండా, నిన్నటి తరం స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ వంటి వారితో కూడా సినిమాలు చేసి లేడీ సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగింది. కానీ ఏమి లాభం, చెడు అలవాట్లు వల్ల ఆమెకి ఎన్నో క్రేజీ ఆఫర్స్ దూరం అయ్యాయి. మద్యానికి బానిస అయిన ఈమెతో సినిమాలు చెయ్యడానికి హీరో భయపడిపోతున్నారు.

ఇంతకీ ఆమె ఎవరో ఈపాటికే మీకు అర్థం అయిపోయి ఉండాలి..అవును ఆమె శృతి హాసనే. ఈమెకి తన తండ్రి లాగానే అద్భుతమైన టాలెంట్ ఉంది, కానీ చెడు అలవాట్లు కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయి. సినిమా షూటింగ్స్ కి ఒకప్పుడు ఈమె మద్యం సేవించి వచ్చేది అట. షాట్స్ చేస్తున్నప్పుడు ఈమె దగ్గర నుండి వచ్చే మందు వాసనని భరించలేకపోయేవారట స్టార్ హీరోలు. అంతే కాదు, ఒక్కోసారి షూటింగ్ స్పాట్ లోనే తాగేదట కూడా. సౌత్ లోనే పెద్ద స్టార్ హీరోయిన్, పైగా ఆమె తండ్రి కమల్ హాసన్ పెద్ద సూపర్ స్టార్, అందుకే ఆమెని ఏమి అనేవారు కూడా కాదట హీరోలు.

కానీ ఆమెతో సినిమాలు చెయ్యడం మాత్రం మానేశారు. అకస్మాత్తుగా శృతి హాసన్ కొన్ని సంవత్సరాలు టాలీవుడ్ లో కనిపించకుండా పోయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆమె అలా కనపడకపోవడానికి కారణం స్టార్ హీరోలు ఆమెని దూరం పెట్టడం వల్లే అట. అలా కెరీర్ లో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన శృతి హాసన్ కేవలం ఒక స్థాయి వరకు వచ్చి ఆగిపోయింది. కానీ గత ఏడాది ఆమె చేసిన సినిమాలన్నీ హిట్టే, అందులో సలార్, వాల్తేరు వీరయ్య గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.