Guess The Actress : ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.?, ఇండస్ట్రీ లోపలికి రావాలంటే కేవలం అందాలు ఆరబొయ్యడం మాత్రమే కాదు,నత్తన కూడా ఉండాలి , అప్పుడే వయస్సు పెరిగినప్పటికీ కూడా అవకాశాలు పెరుగుతూనే ఉంటాయి అని నిరూపించిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు ఆమె.కెరీర్ ప్రారంభం లోనే ఆమె తన అద్భుతమైన నటన తో నేషనల్ అవార్డు ని కూడా సొంతం చేసుకుంది.

తెలుగు మరియు తమిళం భాషలకు కలిపి దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించింది. ఆమె మరెవరో కాదు ప్రియమణి. 2003 వ సంవత్సరం లో ‘ఎవరే అతగాడు’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ప్రియమణి, ఆ తర్వాత తమిళం మరియు మలయాళం సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. మళ్ళీ తెలుగు లో ఆమె జగపతి బాబు హీరో గా నటించిన ‘పెళ్ళైనా కొత్తలో’ అనే సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమా మంచి హిట్ అవ్వడం తో ప్రియమణి కి టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో మంచి అవకాశాలు వచ్చాయి. అలా కెరీర్ ప్రారంభం లోనే పీక్ రేంజ్ ని చూసిన ప్రియమణి కి బాలీవుడ్ లో క్రేజీ స్టార్ హీరోల నుండి అవకాశాలు వచ్చాయి. అయితే ఎన్ని అవకాశాలు వచ్చినా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని విడిచి పెట్టి ఎక్కడికీ పోను అని పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది.అయితే అప్పట్లో షారుఖ్ ఖాన్ స్పెషల్ రిక్వెస్ట్ చెయ్యడం తో ఆమె ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ చిత్రం లో ఒక ఐటెం సాంగ్ లో నటించింది.

ఇప్పుడు లేటెస్ట్ గా షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘జవాన్’ చిత్రం లో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించింది. ఈ సినిమా హిట్టయితే ప్రియమణి రేంజ్ మరింత పెరిగిపోతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు, ఇక రీసెంట్ గా ఈమె తెలుగు లో నాగ చైతన్య హీరో గా నటించిన ‘కస్టడీ’ చిత్రం లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. వీటితో పాటుగా పలు తమిళ సినిమాల్లో కూడా నటిస్తుంది ప్రియమణి.
