Guess The Actress : ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా!’ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎంత హాట్ గా తయారైందో చూస్తే నోరెళ్లబెడుతారు!

- Advertisement -

Guess The Actress : బుల్లితెర మీద స్టార్ యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న ప్రదీప్, ఆ తర్వాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన ఆయన, 2021 వ సంవత్సరం లో విడుదలైన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరో గా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి సూపర్ హిట్ ని అందుకున్నాడు.

Guess The Actress
Guess The Actress

ముఖ్యంగా ఈ చిత్రం లోని ‘నీలి నీలి ఆకాశం ‘ అనే పాట అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఒక స్టార్ హీరో సినిమాకి సంబంధించిన పాట హిట్ అయితే ప్రతీ చోట ఎలా అయితే వినిపిస్తుందో, ఈ పాట కూడా అదే విధంగా వినిపించింది. ఇప్పటికీ ఈ పాట ఫేమస్ , ప్రతీ ఒక్కరి ప్లే లిస్ట్ లో కచ్చితంగా ఈ పాట ఉంటుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Pradeep

ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా అమ్రితా అయ్యర్ అనే అమ్మాయి నటించింది. ఈమె తెలుగు లో రామ్ హీరో గా నటించిన ‘రెడ్’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. అంతకు ముందు ఈమె 10 కి పైగా తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అందులో తలపతి విజయ్ నటించిన ‘బిజిల్’ చిత్రం ఈ హీరోయిన్ కి మంచి గుర్తింపు ని తెచ్చిపెట్టింది. ఇందులో ఒక ఫుట్ బాల్ ప్లేయర్ గా అమ్రితా అయ్యర్ చాలా పవర్ ఫుల్ పాత్ర లో నటించింది.

- Advertisement -
amtritha aiyer

అలా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రానికి ముందు ఈమె ఇన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. చాలా మంది ఈ చిత్రం తోనే ఆమె మన తెలుగు సినిమాకి పరిచయం అయ్యిందని అనుకున్నారు, ఇక ప్రస్తుతం ఇప్పుడు ఈమె తేజ సజ్జల హీరో గా నటించిన ‘హనుమాన్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా మీద ఇప్పుడు ఆడియన్స్ లో ఏ రేంజ్ హైప్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అనుకున్న విధంగా ఈ చిత్రం సక్సెస్ సాధిస్తే మాత్రం అమ్రితా అయ్యర్ పేరు టాలీవుడ్ లో మారుమోగిపోతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here