ఈ ఫొటోలో అమాయకంగా , ఎంతో క్యూట్ గా చూస్తున్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా..?, అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత హీరో గా మారి తెలుగు , హిందీ , తమిళం బాషలలో సూపర్ హిట్స్ అందుకున్న ఏకైక హీరో గా నిలిచాడు. బోలెడంత టాలెంట్ ఉన్నప్పటికీ స్థిరత్వం లేకపోవడం తో ఎక్కడా కూడా తనకంటూ ఒక స్థిరమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు. కానీ ఇతగాడికి ఇప్పటికీ అమ్మాయిలలో క్రేజ్ ఉంది.

నాలుగు పదుల వయస్సు దాటినప్పటికీ కూడా ఇప్పటికీ నిత్యయవ్వనం తో ఉంటాడు. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ ని అయినా తన అందం తో, మత్తెకించే మాటలతో క్షణాలలో పడేయగలడు. ఇతగాడు నడిపిన అఫైర్స్ లిస్ట్ తీస్తే చాంతాడంత ఉంటుంది. ఇన్ని క్లూలు ఇచ్చిన తర్వాత గుర్తు పట్టకుండా ఎలా ఉంటారు. అవును..మీరు అనుకున్నట్టు అతను ప్రముఖ హీరో సిద్దార్థ్.

2000 దశాబ్దం ప్రారంభం లో ఇతగాడు టాలీవుడ్ లో సృష్టించిన సెన్సేషన్ ని అంత తేలికగా ఎవరు మర్చిపోగలరు. ‘బొమ్మరిల్లు’,’నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘ఓయ్’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ ఇలాంటి సినిమాలతో యూత్ లో తిరుగులేని క్రేజ్ ని దక్కించుకున్నాడు. అయితే ఒకటి రెండు ఫ్లాప్స్ రాగానే టాలీవుడ్ ని వదిలి బాలీవుడ్ కి వెళ్లడం. అక్కడ ‘రంగ్ దే బసంతి’ వంటి హిట్ కొట్టిన తర్వాత, కొన్ని సినిమాలు చేసి అవి ఫ్లాప్ అవ్వడం తో కోలీవుడ్ కి వెళ్లడం, అక్కడ కూడా హిట్స్ మరియు ఫ్లాప్స్ ని అందుకొని, ఇప్పుడు అక్కడ మార్కెట్ పూర్తి గా కోల్పోయిన తర్వాత టాలీవుడ్ కి రావడం.

ఇలా స్థిరత్వం లేకపోవడం వల్ల ఆయన టాలెంట్ కి తగ్గ రేంజ్ కి వెళ్లలేదని అంటుంటారు విశ్లేషకులు. ఇప్పుడు రీసెంట్ గా ఆయన టక్కర్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా సిద్దార్థ్ కరెక్ట్ గా ఒక్క సినిమా తీస్తే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేంత కెపాసిటీ ఉంది. మరి ఆయన ఏ సినిమాతో గ్రాండ్ కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.