Guess The Actor : తల్లి ఒడిలో అమాయకంగా.. ముద్దొచ్చేలా చూస్తున్న ఈ చిన్నది ఒకప్పుడు ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలను షేక్ చేసిన హీరోయిన్. తన క్యూట్ లుక్, నటన, చలాకీ తనంతో కుర్ర కారును యమ ఎట్రాక్ట్ చేసింది. దీంతో పాటు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోలతో జతకట్టింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న ఇప్పటికీ అదే క్యూట్ నెస్ తో తన అభిమానులను అలరిస్తోంది. ఇంతకీ క్యూట్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు.. కుదరితే నాలుగు మాటలు.. వీలైతే కప్పు కాఫీ అంటూ ఫేమస్ అయిపోయిన బొమ్మరిల్లు ఫేమ్ జెనీలియా డిసౌజా. ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫొటోస్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ముంబైకి చెందిన జెనీలియా 2003లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది.
‘తుజే మేరి కసమ్’ సినిమాతో రితేష్ దేశ్‌ముఖ్ సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అగ్ర దర్శకుడు శంకర్ డైరెక్షన్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన బాయ్స్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సిద్ధార్థ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుని సౌత్ ప్రేక్షకులకు దగ్గర అయింది. కాగా జెనీలియా హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా సత్యం. ఈ మూవీలో అక్కినేని హీరో సుమంత్ సరసన జంటగా నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచి జెనీలియా కెరీర్కు మంచి పునాదిని ఏర్పాటు చేసింది. దీంతో సౌత్‌లో జెనీలియా కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ముఖ్యంగా తెలుగులో బిజీ హీరోయిన్ గా మారింది. ఇక జెనీలియా సిద్ధార్థ్ కాంబోలో వచ్చిన రెండో మూవీ బొమ్మరిల్లు. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అందుకుంది.
జెనీలియా కు భారీ క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. అనంతరం శీను వైట్ల డైరెక్షన్లో ఈమె నటించిన ఢీ, రెడీ సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. తర్వాత చేసిన కొన్ని సినిమాలు ఆశించినంతగా ఆడకపోవడంతో ఆమె గ్రేస్ కాస్త తగ్గింది. మ్యూజిక్ పరంగా సెన్సేషన్ గా నిలచిన రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ కూడా నిరాశపరిచింది. ఇక తెలుగులో జెనీలియా చివరిగా రానా హీరోగా తెరకెక్కిన నా ఈష్టం సినిమాలో నటించింది. ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. తర్వాత ఆమె టాలీవుడ్‌కు దూరమైంది. తన మొదటి సినిమాలో హీరోగా నటించిన రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పటికి జెనీలియా అదే క్యూట్ నెస్ తో అంతే ఫీట్ గా కనిపిస్తుంది. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్ముడు.. రీ ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలతో హిట్ అందుకుంటుంది. ప్రస్తుతం ఓ హిందీ, ఓ కన్నడ సినిమాలో నటిస్తోంది.