Guess The Actor ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్నారిని చూస్తే గుండె తరుక్కుపోతుంది, అతి చిన్న వయస్సులోనే హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నారి దేశం లో లోనే అన్నీ ప్రాంతీయ బాషలలో మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమెకి 19 ఏళ్ళ వయస్సు వచ్చేలోపు 30 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత కూడా ఆమె 20 సినిమాల్లో హీరోయిన్ గా నటించేందుకు సంతకం చేసింది.
కానీ దురదృష్టం కొద్దీ ఆమె మీద మీద నుండి జారీ క్రిందపడి చనిపోయింది. ఆమె ఎవరో ఈపాటికే మీ అందరికీ అర్థం అయ్యుండాలి, ఆమె పేరు దివ్య భారతి. చూపులు తిప్పుకోలేని అందం, అద్భుతమైన అభినయం ఆమె సొంతం. 1990 వ సంవత్సరం లో విడుదలైన ‘నిల పెన్నై’ అనే తమిళ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈమె, ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘బొబ్బిలి రాజా’ చిత్రం లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద సూపర్ హిట్ అయ్యేలోపు ఆమెకి అవకాశాలు వెల్లువలాగా కురిశాయి. అలా తెలుగు , తమిళం మరియు హిందీ భాషలకు కలిపి 1990 వ సంవత్సరం నుండి 1993 వ సంవత్సరం వరకు 30 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అంటే, ఆమె రేంజ్ అప్పట్లో ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. 1993 వ సంవత్సరం లో ఆమె చనిపోయింది, ఆమె చనిపోక ముందు 20 సినిమాల్లో హీరోయిన్ గా చేసే ఛాన్స్ దక్కింది.
ఇక ఆమె చనిపోయిన తర్వాత ఆ పాత్రలను శ్రీదేవి, కరిష్మా కపూర్, ప్రియాంక చోప్రా , కాజోల్,జూహీ చావ్లా వంటి హీరోయిన్స్ చేసి కెరీర్ లో మంచి సక్సెస్ లను అందుకున్నారు. దివ్య భారతి ని చూసి నేటి తరం కుర్రాళ్ళు కూడా ఫిదా అయ్యిపోతున్నారు. కానీ ఆమె చనిపోయింది అనే విషయం తెలిసి కంటతడి పెట్టుకుంటున్నారు.ఇది ఇలా ఉండగా ఆమె చిన్ననాటి ఫోటోలు కొన్ని రీసెంట్ గా సోషల్ మీడియా లో సర్క్యూలేట్ అయ్యాయి, ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.