Guess The Actor : ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో మన టాలీవుడ్ లో కొంత మంది స్టార్ సెలబ్రిటీస్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబం తో ఆయనకి ఉన్న రిలేషన్ మామూలుది కాదు. ఎప్పుడు హైదరాబాద్ కి వచ్చినా చిరంజీవి ని కలుస్తుంటాడు సచిన్. కేవలం చిరంజీవి మాత్రమే కాకుండా, నాగార్జున కూడా సచిన్ టెండూల్కర్ కి మంచి సన్నిహితమే. అలా చిరంజీవి కి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్లంతా సచిన్ టెండూల్కర్ కి బాగా పరిచయం.

రీసెంట్ సమయం లోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని కూడా ఒకసారి కలిసాడు. వీళ్ళిద్దరిని ఒక చోట చూసిన అభిమానులు ఎంతగానో మురిసిపోయారు. అదంతా పక్కన పెడితే ఈ క్రింది ఫోటో లో సచిన్ టెండూల్కర్ తో ఉన్న ఈ క్యూట్ లిటిల్ బాయ్ ఎవరో గుర్తు పట్టారా..?, ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండింగ్ అవుతుంది.

ఆ క్యూట్ లిటిల్ బాయ్ మరెవరో కాదు, సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్. మెగాస్టార్ చిరంజీవి ని కలవడానికి సచిన్ వచ్చినప్పుడు ఆయనతో కలిసి దిగిన ఫోటో ఇది. రోషన్ చిన్నప్పటి ఫోటోలు ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు. అలాంటిది ఒక్కసారిగా సచిన్ లాంటి లెజెండ్ తో ఫోటో చూసేసరికి ఆడియన్స్ షాక్ కి గురి అయ్యారు.

‘పెళ్ళిసందడి’ అనే చిత్రం తో టాలీవుడ్ లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చిన రోషన్, తొలి సినిమాతోనే నటన , డ్యాన్స్ మరియు ఫైట్స్ పరంగా శబాష్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా లుక్స్ విషయం లో ఇతను స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోడు అనే కామెంట్స్ ని కూడా దక్కించుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన రెండు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి వైజయంతి మూవీ బ్యానర్ లో తెరకెక్కుతుంది. సరైన ప్లానింగ్ ఉంటే రోషన్ స్టార్ హీరో రేంజ్ వెళ్లగలిగే కెపాసిటీ ఉన్నోడు, మరి ఆ రేంజ్ కి వేళ్తాడో లేదో చూడాలి.