Guess The Actor : ‘సమరసింహారెడ్డి’ సినిమాలో నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ అయ్యిందో తెలుసా?

- Advertisement -

Guess The Actor : టాలీవుడ్ లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాల ట్రెండ్ మొదలైంది నందమూరి బాలకృష్ణ ‘సమరసింహా రెడ్డి’ చిత్రం తోనే.అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్, టాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.అప్పటి ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమా ఆరోజుల్లోనే 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.ఈ చిత్రం లో మాస్ సన్నివేశాలు, ఎలివేషన్ సన్నివేశాలు ఎంత అద్భుతంగా ఉంటాయో, సెంటిమెంట్ సన్నివేశాలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి.ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్ ఈ చిత్రం లో అద్భుతంగా పండింది అనే చెప్పాలి.ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా కూడా, ఇచ్చిన మాట కోసం బాలయ్య వాళ్ళని చెల్లెల్లు గా స్వీకరించి,వాళ్ళ కోసం పడే తపన, తాపత్రయం ని చూస్తే కన్నీళ్లు రాక తప్పదు.ముఖ్యంగా దివ్యాంగురాలి ( సరస్వతి) పాత్ర తో బాలకృష్ణ కి ఉన్న ఎమోషన్స్ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తుంది.

Guess The Actor
Guess The Actor

ముఖ్యంగా సినిమాలో వచ్చే రైల్వే ట్రాక్ సన్నివేశాన్ని ఇప్పుడు చూసినా ఎమోషనల్ అయ్యిపోతాము, అంత అద్భుతంగా ఉంటుంది ఆ సన్నివేశం.ఆ పాత్ర పోషించిన అమ్మాయి పేరు ‘సహస్ర’.ఈమెకి ఇది తొలిసినిమా అనుకుంటే పొరపాటే.అంతకు ముందు ఆమె వందల సినిమాల్లో బాలనటిగా నటించి స్టార్ కిడ్ గా ఎదిగింది.చిరంజీవి , బాలకృష్ణ , సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణం రాజు, కృష్ణ , మోహన్ బాబు ఇలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించింది ఈమె. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ ఆఖరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’ లో ‘సుఖీభవ..సుమంగళి’ అనే పాటలో ఈ అమ్మాయి కనబర్చిన అభినయం ని అంత తేలికగా ఎవరు మాత్రం మర్చిపోగలరు. ఈ పాటలో ఈమెతో పాటుగా మంచు మనోజ్ కూడా నటిస్తాడు. అలా స్టార్ కిడ్ గా ఎంతో ఉన్నత స్థానానికి వెళ్లిన ఈ అమ్మాయి, ‘సమరసింహా రెడ్డి’ సినిమాతోనే తన కెరీర్ కి గుడ్ బై చెప్పేసింది.

balakrishna

ఎందుకంటే ఆమెకి నటన మీద కంటే చదువు మీదనే ఎక్కువ ఆసక్తి ఉంటుందట. రీసెంట్ గా ఈమె ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది, ఆ ఇంటర్వ్యూ లో ఈమె పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ‘నా మొదటి సినిమా భాను చందర్ గారు హీరో గా నటించిన ఉద్యమం.ఆ సమయం లో నేను ఎంతో చిన్నపాప ని అయ్యేసరికి నన్ను అందరూ చాలా బాగా చూసుకునేవారు. రామ్ చరణ్ నా చిన్నతనం లో నాకు మంచి మిత్రుడు, రౌడీ అల్లుడు సినిమా షూటింగ్ చేస్తున్న సమయం లో అప్పుడప్పుడు చిరంజీవి గారు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవాడు.అక్కడ రామ్ చరణ్ టెడ్డీ బీర్ తో భలే ఆదుకునే దానిని, రామ్ చరణ్ కూడా నాతో బాగా ఆదుకునేవాడు’ అంటూ చెప్పుకొచ్చింది, ప్రస్తుతం బిజినెస్ రంగం లో దూసుకుపోతున్న ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఒకటి ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Sahasra
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here