Guess The Actor : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీల చిన్న నాటి ఫోటోలు.. బడా సెలబ్రెటీలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినప్పటి స్టార్ హీరో ఫోటోలను అభిమానులు బాగా వెతికి వెతికి ట్రెండ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న బాబు పేరు ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఓ పక్కన శ్రీదేవి మరో పక్కన రజనీకాంత్ మధ్యలో చాలా ముద్దుగా కూర్చున్న ఈ బాబు ఇప్పుడు క్రేజీ పాన్ ఇండియా హీరో. ఒక్క సినిమాతో వెయ్యి కోట్లను కొల్లగొట్టే సత్తా ఉన్న హీరో అనే చెప్పాలి. ఇంతకీ ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?.. చెప్పలేకపోతున్నారా.. ఒకే మేమే చెప్తాం. మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న హీరో మరెవరో కాదు హృతిక్ రోషన్. 1986లో రజనీకాంత్ నటించిన ‘భగవాన్ దాదా’ చిత్రంలో హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు.

ఈ సినిమాకు హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో రజనీకాంత్ తో పాటు దివంగత అందాల తార శ్రీదేవి నటించారు. హృతిక్ రోషన్ 2000 సంవత్సరంలో రాకేష్ దర్శకత్వం వహించిన ‘కహో నా ప్యార్ హై’ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఒక్క సినిమాలో ఆయన నటిస్తే వెయ్యి కోట్లు కొల్లగొడుతుందంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . 49 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫిట్ నెస్ తో.. స్టైలిష్ లుక్స్ తో అమ్మాయిలను కట్టిపడేస్తున్నాడు హృతిక్ రోషన్.