Guess The Actor: వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు సినీ రంగం లోకి అడుగుపెట్టడం కొత్తేమి కాదు,అలాగే ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి కూడా అలాంటిదే.ఈమె ఇంటర్నేషనల్ లెవెల్ లో కిక్ బాక్సింగ్ పోటీలలో పాల్గొన్న దిగ్గజం, ఎన్నో టైటిల్స్ ని గెలుచుకుంది కూడా, ఆ తర్వాత ఈమె సినిమాల్లోకి వచ్చి పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది, మంచి పేరు తెచ్చుకుంది.

కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా హిందీ,తమిళ భాషల్లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఆమె మరెవరో కాదు ‘రితిక సింగ్’. మన తెలుగు లో ఈమె విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘గురు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఈ సినిమాలో కూడా ఆమె కుస్తీ చేసే అమ్మాయిగానే కనిపించింది. తొలిసినిమానే అయ్యినప్పటికీ అన్నీ ఎమోషన్స్ ని అద్భుతంగా పలికించి శబాష్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ.

చిన్నప్పటి నుండి తన తండ్రి ప్రోత్సాహం తో కిక్ బాక్సింగ్ మీద ట్రైనింగ్ తీసుకుంటూ వచ్చిన ఈమె, ఆ తర్వాత పెద్దయ్యాక ‘సూపర్ ఫైట్ లీగ్’ లో పాల్గొని నాలుగు మ్యాచులు ఆడగా , ఒక మ్యాచ్ లో గెలుపొందింది. ఆ తర్వాత ఈమె సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమా తమిళ హీరో మాధవన్ తో ‘ఇరుంది సుత్రు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఈ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత దీనిని తెలుగు లో వెంకటేష్ ‘గురు’ పేరుతో రీమేక్ చేసాడు.

రెండు సినిమాల్లో కూడా ఈమెనే హీరోయిన్ గా నటించింది. మంచి పేరు కూడా సంపాదించింది. ఈ సినిమా తర్వాత ఆమె శివ లింగ, ఓ మై కడువలే, నీవెవరో వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఈమె మలయాళం లో దుల్కర్ సల్మాన్ హీరో గా నటిస్తున్న ‘కింగ్ ఆఫ్ కోత’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉండగా ఆమెకి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు కొన్ని ఎక్సక్లూసివ్ గా మీకోసం అందిస్తున్నాము చూడండి.


