బిగ్ బాస్ హౌస్ లో అమ్మాయిలతో పులిహోర కలుపుతూ లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్ కళ్యాణ్(Arjun Kalyan). బిగ్ బాస్ హౌస్ లో శ్రీ సత్యతో ప్రేమాయణం నడుపుతూ మరింత ఫేమస్ అయ్యాడు.అయితే మొదట వాసంతితో అర్జున్ కళ్యాన్ దగ్గరవుతున్నట్లు అనిపించినా.ఆమె ఎలిమినేట్ అయిన తరువాత శ్రీ సత్యతో ఎక్కువ బాండింగ్ ఏర్పడింది.గేమ్ లో ఆమెకోసం త్యాగాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా అర్జున్ వాసంతితో కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేశాడు. అది వైరలవుతోంది.

స్టార్ మాలో వచ్చే ఆదివారం స్టార్ మా పరివార్ ప్రోగ్రాంలో వీరిద్దరూ కలిసి ఉప్పెన సినిమాలోని జల జల జలపాతం పాటకు డ్యాన్స్ చేశారు. సినిమాల్లో హీరో, హీరోయిన్లు కూడా మరీ అంత దారుణంగా నటించరేమో అనే భావన కలిగేలా చేశారు. ఓ టీవీ షోలో ఉన్నామనే ఫీలింగ్ కూడా లేకుండా.. అందరి ముందే అన్నీ చేస్తేస్తూ డ్యాన్స్ వేశారు. జల జల జలపాతం నువ్వూ అంటూ రొమాంటిక్ సాంగ్‌తో అర్జున్, వాసంతి జంట మితిమీరి రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. ఎక్కడపడితే అక్కడ పట్టుకుని ఇద్దరూ మైమరిచిపోయి రొమాన్స్‌లో జీవించారు. ఎ సర్టిఫికెట్ ని తలపించేలా వీరు డ్యాన్స్ చేయడం గమనార్హం.

ఇది చూసిన కొందరు ఛీ అని కామెంట్ పెడుతున్నారు. మరికొందరేమో ఇదేం రొమాన్స్ అంటూ వామ్మో అంటున్నారు. బుల్లితెరపై వచ్చిన రియాలిటీ షోలలో ఎక్కుగా పాపులారిటీ సంపాందించుకుంది బిగ్ బాస్. ఈ షోలో పలువురి కంటెస్టెంట్స్ మధ్య ప్రేమ, రొమాంటిక్ సన్నివేశాలు కొంతమందిని ఆకట్టుకుంటే మరికొంతమందికి చిరాకు తెప్పించాయి. ప్రతి సీజన్ లో ఏదో ఒక జంట కనిపిస్తూనే ఉంటుంది. అలాగే ఇటీవల ముగిసిన బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో బ్యూటిఫుల్ శ్రీసత్య వెంట అర్జున్ కల్యాణ్ పడిన విషయం తెలిసిందే.