Gossips : అతను తమిళం లో ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ , కమల్ హాసన్ తర్వాత పెద్ద నటుడు. అజిత్ , విజయ్ అప్పుడప్పుడే ఇండస్ట్రీ లో చిన్న చిన్న హిట్స్ అందుకుంటున్న రోజుల్లోనే ఇతను సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని షేక్ చేసాడు. శంకర్ లాంటి దర్శకులతో కూడా పని చేసాడు , కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్తుంది అనుకుంటున్న సమయం లో వ్యక్తిగత సమస్యలు అతని కెరీర్ లో పాతాళలోకం లోకి తొక్కేసింది.

ఒక ప్రముఖ తమిళ దర్శకుడి కుమారుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఇతను, తన తండ్రి పేరు ఉపయోగించుకోకుండా స్వయంగా తన సొంత టాలెంట్ తో సినిమాల్లో అవకాశాలను సంపాదించుకున్నాడు. అయితే ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురు ని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో, అప్పటి నుండే ఇతని కెరీర్ తలక్రిందులు అయ్యింది. సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గిపోయాయి , క్రమంగా ఇప్పుడు క్యారక్టర్ రోల్స్ వేసుకునే స్థితికి వచ్చేసాడు.
పెళ్ళైన కొత్తలో అంత బాగానే ఉండేది, ఎప్పుడైతే వీళ్లిద్దరికీ కొడుకు పుట్టాడో , అప్పటి నుండి విబేధాలు మొదలయ్యాయి. భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది, ఆమెతో పాటుగా కొడుకుని కూడా తీసుకెళ్లింది. ఆ హీరో కి తన కొడుకు అంటే చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమ, కేవలం తన కొడుకు కోసమే మళ్ళీ తిరిగి ఇంటికి రమ్మని భార్యని ప్రాధేయపడ్డాడు, కానీ ఆమె ఒప్పుకోలేదు. నేరుగా కోర్టు కి వెళ్లి, తన భార్య ని తిరిగి ఇంటికి వచ్చేలా చెయ్యమని న్యాయవాదులను ప్రాధేయపడ్డాడు. ఈ కోర్టు కేసు నడుస్తున్న సమయం లోనే వీళ్లిద్దరి మధ్యలోకి మూడవ వ్యక్తి వచ్చాడు.
ఈ హీరో భార్య గతం లో తనని పెళ్లాడిందని, తనకి విడాకులు ఇవ్వకుండానే ఇతనిని పెళ్లి చేసుకుంది అంటూ బాంబు పేల్చాడు. దెబ్బకి ఆ హీరో మైండ్ బ్లాంక్ అయ్యింది, మనసు ముక్కలైపోయింది. ఇక చేసేదేమి లేక తన భయ కి విడాకులు ఇచ్చాడు, ఈ పీరియడ్ లో ఆయన పడిన మానసిక వేదన కారణంగా స్క్రిప్ట్స్ ని సరిగా ఎంచుకోలేకపోయాడు, కెరీర్ లో వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. హీరో గా స్టార్ స్టేటస్ మొత్తం పోగొట్టుకొని ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తున్నాడు.