Gossips : అమ్మాయిలు సిగెరెట్ తాగడం , మందుకొట్టడం వంటివి చేస్తే అప్పట్లో మహాపాపం చేసినట్టు చూసేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు అలాంటి పనులు చెయ్యడం చాలా కామన్ అయిపోయింది. మారుతున్న నాగరికతకు అలవాటు పడిన జనం కూడా వాళ్ళను పట్టించుకోవడం మానేశారు. ముఖ్యంగా పెద్దపెద్ద సిటీస్ లో అయితే అమ్మాయిలు పబ్లిక్ గా రోడ్డు మీదనే సిగరెట్స్ తాగడం వంటివి మనం గమనించొచ్చు.

కోట్ల మంది ప్రేక్షకులు చూసే సినిమాల్లో కూడా ఇలాంటివి చూపిస్తున్నారు. సినిమా హీరోయిన్స్ కి అయితే ఇవన్నీ చాలా కామన్. అలాంటి హీరోయిన్స్ లో కావ్య థాపర్ కూడా ఒకరు. ఈమధ్య కాలం లో ఈమె పేరు సోషల్ మీడియా లో బాగా వినిపిస్తుంది. ఎందుకంటే ఈమె రవితేజ హీరో గా నటించిన ఈగల్ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. రేపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.

ఇదంతా పక్కన పెడితే 2022 వ సంవత్సరంలో ముంబైలోని ఒక ప్రాంతం లో కావ్య థాపర్ బాగా తాగేసి కార్ తోలుకుంటూ ఒక యాక్సిడెంట్ చేసింది. ఈ ఘటన లో ఒకరికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఆ తర్వాత పోలీసులు కావ్య థాపర్ ని నిలదియ్యగా వారితో ఈమె గొడవ పెట్టుకుంది. తన వద్దకు వచ్చిన లేడీ కానిస్టేబుల్స్ ని అసభ్యకరమైన పదాజాలం తో దుర్భాషలు ఆడింది.

ఆ తర్వాత ఈమెని బలవంతంగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కేసు ని ఫైల్ చేసారు. ఆరోజు ఈమె అదృష్టం బాగుండడం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. దాంతో ఈ కేసు నుండి ఈమె తొందరగానే బయటపడింది. కానీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమెని ఈ సంఘటన గురించి ఒక యాంకర్ అడగగా, ఆమె వైపు కోపం గా చూసింది.