Gopi Chand : సైలెంట్ గా తన పని తాను చేసుకుంటాడు. గొడవలకు వెళ్లడు. నెగెటివిటీకే కాకుండా హీరోయిన్లకు దూరంగా ఉంటారు.షూటింగ్ వచ్చారా? సీన్స్ కంప్లీట్ అయ్యాయా? అంతకు మించి ఇతరులతో రిలేషన్స్ మెయింటెన్ చేయడానికి ఇష్టపడడు ఈ ఫ్యామిలీ హీరో. కాంట్రవర్సీలకు దూరంగా ఉండే ఈ హీరో ఎవరా అనుకుంటాన్నారా? అయితే ఎప్పుడూ నవ్వుతూ కన్పించే ఆ స్టారే గోపిచంద్.
ఇక ఈ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే.ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకుని చాలా మంది మోసం చేశారు కూడా. మూవీస్ కోసం ఈ మ్యాచో స్టార్ ని అప్రోచ్ అయినప్పుడు కథ ఒకలా చెప్పి షూట్ మరోలా చేసేవారంట.

అలా కొందరు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు గోపీచంద్ కెరీర్ ను నాశనం చేశారు కూడా. ఇలానే ఒక సినిమా వల్ల అందులో నటించిన ఓ హీరోయిన్ వల్ల ఈయన మంచి క్యారెక్టర్ కు నెగిటివ్ వచ్చి పడింది. ఆమె ఎవరో కాదు తెలుగు హీరోయిన్ రాశి. మహేష్ బాబు కెరీర్ లో లీస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ నిజం. ఇందులో గోపీచంద్ విలన్. ఆయనకు పెయిర్ గా రాశి నటించింది.

గోపిచంద్, రాశి ఓ సీన్ లో రొమాన్స్ చేస్తుంటారు. అది మరీ దారుణంగా ఉంటుంది. అప్పటివరకు పద్ధతిగా నటించిన రాశి ఇలాంటి రోల్ ప్లే చేసేసరికి జనాలు చూడలేకపోయారు. గోపీచంద్ నుంచి ఇలాంటి సీన్స్ కూడా ఆయన ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు. ఈ మూవీ గోపీచంద్, రాశి ఇద్దరికీ నెగెటివిటీని తెచ్చిపెట్టింది. ఇద్దరికీ కథ ఒకలా చెప్పి సీన్స్ షూట్ చేసే టైంలో మరోలా చేశారంట. సెన్సార్ కట్ తర్వాత ఆ సీన్స్ ను వేరేలా చూపించారని టాక్. మొత్తం మీద రాశితో గోపిచంద్ చేసిన రొమాన్స్ ఇద్దరి లైఫ్ లో సరిదిద్దికోలేని తప్పుగా మిగిలిపోయింది. ఇప్పటికీ ఆ మూవీలో రొమాన్స్ సీన్స్ వస్తే గోపీచంద్ తలెత్తుకోలేకపోతాడంట.