Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ ఫెమస్ స్టార్ అయ్యాడు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఈ సినిమాలో ఎన్టీఆర్ ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నారు.. దీంతో సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అలాగే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది.. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’ దేవర నార్త్ బెల్ట్ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. కరణ్ జోహార్ ఈ నిర్మాణ సంస్థకి ఓనర్. గతంలో ఈ నిర్మాణ సంస్థ బాహుబలి సినిమాని నార్త్ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది.. అక్కడ భారీ సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు..

- Advertisement -

ఇక ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు ఇటీవల వార్తలు నెట్టింట తెగ వినిపించాయి.. తాజాగా ఆ వార్తలకు చెక్ పెడుతూ మేకర్స్ ఒక పోస్టర్ తో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.. దేవర సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. అనుకున్న దానికన్నా ముందే వస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలుతున్నారు.. ఈ సినిమాను థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని తెగ వెయిట్ చేస్తున్నారు..ఎన్టీఆర్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది.. అనిరూద్ మ్యూజిక్ ను అందిస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here