Balakrishna : విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR ) జన్మించి… ఈ ఏడాదితో 100 సంవత్సరాలు పూర్తి కావడంతో ఆయన శత జయంతి వేడుకలను నందమూరి కుటుంబంతోపాటూ.. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా NTR పేరు మీద కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణేన్ని (NTR Coin) ఆయన గౌరవార్ధం విడుదల చేస్తోంది. ఇవాళ (సోమవారం) ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని విడుదల చేస్తారని తెలిసింది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారని తెలిసింది. నందమూరి కుటుంబం నుంచి నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆహ్వానం వెళ్ళింది. అంటే వీరంతా కూడా ఢిల్లీకి బయల్దేరబోతోన్నారని సమాచారం. అయితే కలిసి వెళ్తారా? ఎవరికి వారు వెళ్తారా? అన్నది తెలియడం లేదు.

ఎన్టీఆర్, బాలయ్య కలిసి వెళ్లి, కలిసి వస్తారా? అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అసలు ఈ ఇద్దరూ వెళ్తారా? లేదంటే ఒకరే వెళ్తారా? అన్నది అనుమానంగానూ మారింది. మరి ఈ ఇద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపిస్తే,మాట్లాడుకుంటే మాత్రం అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతారు. ఎన్టీఆర్ అంటే బాలయ్యకు ఇష్టం ఉండదని, కావాలనే దూరం పెడుతుంటాడని ఇలా ఎన్నెన్నో రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. అందుకే ఎన్టీఆర్ మీద బయోపిక్ తీసినా కూడా అందులో యంగ్ టైగర్‌కు కావాలనే పాత్ర ఇవ్వలేదని అప్పట్లో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే.