Project K : ‘ప్రాజెక్ట్‌ కె’ గ్లింప్స్‌ వచ్చేసింది.. టైటిల్ ఏంటో తెలుసా?

- Advertisement -

Project K : ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టైం వచ్చేసింది.. కొద్ది నిమిషాల క్రితం ప్రాజెక్ట్ కె గ్లింప్స్ వీడియో, టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ వచ్చేసింది..ఈ చిత్రానికి ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. ‘ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడు అంతం అరంభమవుతుంది’ అనే నేపథ్యంలో ఈ చిత్రం సాగనున్నట్లు తెలుస్తోంది. ‘వాటీజ్‌ ప్రాజెక్ట్‌ కె’ అనే ఒక్క డైలాగ్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేలా యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయి. విజువల్స్‌ అందరినీ కట్టిపడేశాయి. ఇక ప్రభాస్‌ లుక్‌ అదిరిపోయింది.

Project K
Project K

అమెరికాలో జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ వేడుకలో చిత్ర బృందం గ్లింప్స్‌, టైటిల్‌ని ప్రకటించింది.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ అలాగే తమిళ స్టార్ హీరో కమల్ హాసన్.. వంటి మహామహులు నటిస్తున్న సినిమా ఇది. కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. దిశా పటాని కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీత దర్శకుడు..

మహానటి.. తర్వాత దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. సైన్స్ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్నాడనే ప్రకటన వెలువడడమే ఆలస్యం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అగ్ర నటులు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌లు కీలక పాత్రలు పోషిస్తుండడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ కీ రోల్‌ ప్లే చేస్తోంది.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here