Getup Srinu : షాకింగ్ డెసిషన్ తీసుకున్న గెటప్ శ్రీను.. ఇక నుంచి దానికి దూరం

- Advertisement -

Getup Srinu : జబర్దస్త్ ఎంతో కమెడియన్లను ఇండస్ట్రీకి అందించింది. అలాంటి వారిలో కమెడియన్ గా గెటప్ శ్రీను ఒకరు. ఆ షోతో మంచి పేరు, పాపులారిటీ సంపాదించుకున్నారు. స్కిట్స్ లో రకరకాల వేషాలు వేస్తూ నటనతో మెప్పించాడు. జబర్దస్త్ తో వచ్చిన ఫేమ్ తో ప్రస్తుతం సినిమాల్లో బిజీగా మారాడు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో చేశాడు. ఇప్పుడు గెటప్ శ్రీను హీరోగా రాజు యాదవ్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మే 17న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రాజు యాదవ్ సినిమా నుంచి ట్రైలర్, సాంగ్స్ రిలీజై సినిమాపై ఆసక్తికి పెంచాయి.

ఇక సినిమా కథ విషయానికి వస్తే.. క్రికెట్ ఆడేటప్పుడు ఫేస్ కి బాల్ తగిలి ఫేస్ ఎప్పుడు నవ్వుతూ ఉండిపోయే వ్యక్తిగా గెటప్ శ్రీను కనిపిస్తాడు. ఈ సినిమాను ఆద్యంతం నవ్వులతో ప్రేక్షకులను గెటప్ శ్రీను రాజు యాదవ్ సినిమాతో అలరించబోతున్నాడు. అయితే సినిమాకి ప్రమోషన్స్ చాలా ముఖ్యం అని తెలిసిందే. అందులోనూ చిన్న సినిమాలకు ప్రమోషన్సే ప్రాణం. సోషల్ మీడియాలో ఎంత ప్రచారం చేస్తే సినిమాకు అంత పబ్లిసిటీ అవుతుంది. అయితే సినిమాని బాగా ప్రమోట్ చేయాల్సిన టైంలో గెటప్ శ్రీను సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

- Advertisement -

‘కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను.. మళ్ళీ కలుద్దాం’ అని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే సినిమా ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ ఉండగా ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు.. అసలు తన ఉద్దేశం ఏంటి.. తన సోషల్ మీడియాలో తన సినిమాని ప్రమోషన్స్ చేయడా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడేమో అని కొందరు అనుకుంటున్నారు. ఇటీవల పిఠాపురంలో గెటప్ శ్రీను పవన్ కళ్యాణ్ జనసేన తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. మే 13 ఎలక్షన్స్ రోజు వరకు సోషల్ మీడియాలో కూడా పవన్ కి సపోర్ట్ గా ప్రచారం చేశాడు. ఇపుడు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను అని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి గెటప్ శ్రీను జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాక సోషల్ మీడియాలోకి వస్తాడా? లేక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంట్రీ ఇస్తాడా చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here