జెనీలియా .. పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బొమ్మరిల్లు సినిమాలో హా.. హా.. హాసినిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముద్ర వేసింది. కెరీర్ పీక్స్ స్టేజీలో ఉన్నప్పుడే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. కాగా.. వివాహం తరువాత సినిమాలకు దూరమైన అమ్మడు ఇటీవలే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.

అయితే.. జెనీలియా మూడో సారి తల్లి కాబోతుందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. జెనీలియా ఆమె భర్త రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి శనివారం (సెప్టెంబర్ 9న) ముంబైలో ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. అయితే.. ఆ ఫోటోల్లో జెనీలియా కాస్త బొద్దుగా కనిపించింది. ఆమె నిలుచున్న విధానం చూసిన నెటీజన్లు.. జెనీలియా మూడో సారి గర్భం దాల్చిందని..

బేబీ బంప్‌తో కనిపిస్తోందంటూ ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై రితీష్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. జెనీలియా గర్భం దాల్చిందన్న ఫోటో స్ర్కీన్ షాట్లను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చాడు. ‘నాకు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు అయినా ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే.. దురదృష్టవశాత్తు ఈ వార్తలో ఎలాంటి నిజం లేదు.’ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రితీశ్ రాశాడు.