Geethanjali Malli Vachindi : హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాకన్నీ అలాగే తెలిసిపోతుంటాయ్ అంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ద్వారా తెలుగు వాళ్లకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం తను టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది. 2014లో కామెడీ అండ్ హర్రర్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రానికి ఈ సినిమా సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి కథనాయకుడిగా నటిస్తుండగా.. సత్యం రాజేశ్, షకలక శంకర్, అలీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ గీతాంజలి మళ్లీ వచ్చింది హీరోయిన్ అంజలికి తన కెరీర్లో 50వ సినిమా. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్రీన్ ప్లేను అందించారు. శివతుర్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే నూతన సంవత్సరం కానుకగా సినిమా నుంచి అంజలి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు హీరో సునీల్ ఫస్ట్ లుక్‌లను విడుదల చేశారు మేకర్స్. ఇవి ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ అప్‌డేట్ ఇచ్చారు. ఈనెల 24న రాత్రి 7 గంటలకు బేగంపేట్ స్మశాన వాటికలో టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. అయితే స్మశాన వాటికలో టీజర్ లాంచ్ ఏంట్రా బాబు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఇండియన్ ఇండస్ట్రీలో ఎప్పుడు లేని విధంగా స్మశాన వాటికలో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించడం సినిమా చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో స్మశాన వాటికలో టీజర్ లాంచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంవీవీ సినిమాస్ బ్యానర్‌తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్ ఈ సినిమాను నిర్మిస్తుండగా… ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
