NTR and Ram Charan లపై గరికపాటి షాకింగ్ కామెంట్స్..

- Advertisement -

NTR and Ram Charan ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్..ఈ సినిమా విడుదల ఏడాది కావొస్తున్న సినిమా క్రేజ్ మాత్రం తగ్గలేదు..ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ హవా కొనసాగుతూనే ఉంది.పాన్‌ ఇండియా రేంజ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసిన ఆర్ ఆర్ ఆర్.. అందులో కొన్ని అరుదైన రికార్డ్స్ ను కూడా క్రియేట్ చేసింది. అంతే కాదు ఇప్పటి వరకూ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్స్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ సినిమా. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ తెలుగు సినిమా ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసింది.

NTR and Ram Charan
NTR and Ram Charan

అయితే, ఒకప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ చులకనగా చూసిన తెలుగు సినిమా..ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అంచనాలను మించి దూసుకుపోతోంది. జేమ్స్ కామరాన్ లాంటి దర్శకుల ప్రశంసలు పొందింది తెలుగు సినిమా. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్‌ బరిలో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అవ్వడంతో.. జక్కన్న,ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ పేర్లు హాలీవుడ్ లో కూడా మారుమోగుతున్నాయి. అంతే కాదు ఇప్పటికే నాటు నాటు సాంగ్ ఆస్కార్ తరువాత అంతటి ఖ్యాతి కలిగిన గోల్డెన్ గ్లోబ్ ను కూడా సాధించింది…

సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళు మాత్రమేకాదు.. ఆధ్యాత్మిక వేత్తలుకూడా నాటు నాటు పాటను ఆకాశానికెత్తుతున్నారు. అచ్చతెలుగు పాటకు ప్రపంచం మెచ్చిందంటూ సంతోషపడుతున్నారు. అంతే కాదు తమ ఆధ్యాత్మిక ప్రసంగాలలో కూడా ఈ పాటను చేర్చుతున్నారు. ట్రిపుల్‌ ఆర్‌కు ఆస్కార్‌ రావాలని కోరుకున్నారు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు. నాటు నాటు గురించి ఆయన చేసిన అద్భుత ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అచ్చ తెలుగులో రాసిన నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం సంతోషించాల్సిన విషయమని అన్నారు. నాటు నాటు పాటలో రెండు పెద్ద కుటుంబాలకు సబంధించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన అద్భుతమన్నారు. కవల పిల్లలు కూడా అలా చేయలేరన్నారు. ఇక చంద్రబోస్ అచ్చ తెలుగులో రాసిన పాటకు ఆ ఇద్దరు నటులు చేసిన అద్భుత నటనతో పాటు, కీరవాణి సంగీతం, రాజమౌళి దర్శకత్వ ప్రతిభ కారణంగా.. నేడు ఈ పాటకు ప్రపంచ స్థాయి బహుమతి రాబోతోంది అంటూ.. గరికపాటు తన అభిమానాన్ని చాటుకున్నారు..

- Advertisement -

ఆ పాటను అదేపనిగా పెట్టుకొని అరగంట పాటు విన్నానని చెప్పాడు.. ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడా వినిపించకుండా… అచ్చమైన నాటు తెలుగు పదాలు వాడుతూ.. ఇంత అద్భుతమైన పాట రాసిన చంద్రబోస్‌కి చిన్నవాడు అయినా.. నమస్కారం. చాలా మంచి పాట, అద్భుతమైన పాట రాశారంటూ గరికపాటి ప్రశంసించారు.ఇక ఈనెల 12న 95వ అకాడమీ అవార్డులను ప్రకటించనున్నారు. మన భారత కాలమానం ప్రకారం 13నవ తారీకు ఉదయం 5 తరువాత ఆస్కార్ లైవ్ చూడవచ్చు. ఈ వేడుకల లైవ్ ను హాట్ స్టార్ అందించబోతోంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here