Gabbar Singh : ఈ నెల 9 వ తారీఖున మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘మురారి’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయే రేంజ్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి రోజు 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టిన ఈ చిత్రం ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయిల గ్రాస్ కి దగ్గరగా వచ్చింది. రీ రిలీజ్ లో ఈ చిత్రానికి ఈ స్థాయి రెస్పాన్స్ వస్తుందని మహేష్ బాబు అభిమానులు కూడా ఊహించలేకపోయారు. ఇప్పుడు ఈ రికార్డ్స్ ని బద్దలు కొట్టేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు కసితో ఎదురు చూస్తున్నారు. రీ రిలీజ్ రికార్డ్స్ కేవలం వీళ్లిద్దరి మధ్యనే కొనసాగుతుంది.

పోకిరి చిత్రం అప్పట్లో రీ రిలీజ్ అయ్యి ఆల్ టైం రికార్డు ని నెలకొల్పగా, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు ‘జల్సా’ చిత్రంతో ఈ రికార్డుని భారీ మార్జిన్ తో బద్దలు కొట్టారు. మళ్ళీ ఈ రికార్డు ని పవన్ కళ్యాణ్ అభిమానులే ఖుషి సినిమా రీ రిలీజ్ తో బద్దలు కొట్టగా, మహేష్ బాబు అభిమానులు బిజినెస్ మ్యాన్ చిత్రం తో ఖుషి రీ రిలీజ్ మొదటి రోజు వసూళ్లను, అలాగే ‘మురారి’ చిత్రంతో బిజినెస్ మ్యాన్ మొదటి రోజు వసూళ్లు, అలాగే ఖుషి ఫుల్ రన్ వసూళ్లను అధిగమించి కొత్త ఆల్ టైం రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు మురారి రికార్డు ని సెప్టెంబర్ 2 న విడుదల కాబోతున్న గబ్బర్ సింగ్ చిత్రంతో బ్రేక్ చేసేందుకు పక్కా ప్లానింగ్ తో వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ముందుగా ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని ఇప్పటి వరకు ఎన్నడూ ఏ రీ రిలీజ్ చిత్రం కూడా విడుదల అవ్వని రేంజ్ లో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే ఈ సినిమా వంద లొకేషన్స్ లో విడుదల అవ్వబోతున్నట్టు సమాచారం.
ఆ ఒక్క ప్రాంతం నుండే మూడు లక్షల డాలర్ల వసూళ్లను రాబట్టాలని, ఓవరాల్ ఓవర్సీస్ నుండి 5 లక్షల డాలర్లు వచ్చేలా ప్లానింగ్ చేస్తున్నారు. అలాగే కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా గ్రాండ్ గా విడుదల చేసి, కేవలం ఈ ప్రాంతాల నుండి వచ్చే గ్రాస్ వసూళ్లతోనే మురారి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గ్రాస్ ని దాటే విధంగా ప్లాన్ చేస్తున్నారట. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబట్టి, సౌత్ ఇండియాలోనే ఆల్ టైం రికార్డు గా నిల్చిన గిల్లీ మొదటి రోజు వసూళ్లను డబుల్ మార్జిన్ తో కొట్టే అవకాశాలు ‘గబ్బర్ సింగ్’ కి ఉన్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట.