Guntur Kaaram సూపర్ స్టార్ మహేష్ బాబు ఈమధ్య కాలం లో డ్యాన్స్ లో తన విశ్వరూపం చూపిస్తున్న సంగతి తెలిసిందే. బాలనటుడిగా ఉన్నప్పుడు డ్యాన్స్ అదరగొట్టేవాడు కానీ, పెద్దయ్యాక ఎందుకో ఆయన డ్యాన్స్ వెయ్యడానికి ఇష్టపడేవాడు కాదు. కానీ గడిచిన నాలుగైదు సినిమాల నుండి ఆయన డ్యాన్స్ విషయం లో ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాడు. ముఖ్యంగా రీసెంట్ గా విడుదలైన ‘గుంటూరు కారం’ చిత్రం లో ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు మహేష్ బాబు శ్రీలీల తో సమానంగా వేసిన డ్యాన్స్ స్టెప్స్ ఎంత పాపులర్ అయ్యిందో మనమంతా చూసాము.

50 ఏళ్లకు దగ్గర పడుతున్నా కూడా, మహేష్ బాబు లోని ఎనర్జీ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ పాటలో ఆయన డ్యాన్స్ విషయం లో ‘ది బెస్ట్’ సీహదనే చెప్పాలి. ఇప్పటికే లిరికల్ వీడియో సాంగ్ కి వంద మిలియన్ వ్యూస్ రాగా, వీడియో సాంగ్ విడుదలైన పది రోజులకే 40 మిలియన్ వ్యూస్ ని రప్పించుకుంది.

ఇకపోతే ఈ పాటని అనుసరిస్తూ నెటిజెన్స్ ఇంస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ఏ రేంజ్ లో చేసారో మనమంతా చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ పాటనే కనిపిస్తూ ఉంది. ఈ పాట కేవలం మన టాలీవుడ్ ఆడియన్స్ వరకే రీచ్ అయ్యింది అనుకుంటే పొరపాటే. చాప క్రింద నీరు లాగ ఇండియన్ మూవీ లవర్స్ మొత్తానికి రీచ్ అవ్వడమే కాకుండా, అంతర్జాతీయ లెవెల్ లో ఈ పాట మారుమోగిపోతుంది.

ముఖ్యంగా అమెరికన్స్ ఈ పాటకి డ్యాన్స్ వేస్తూ ఇంస్టాగ్రామ్ లో రీల్స్ అప్లోడ్ చేస్తున్నారు. అంతే కాకుండా, ఒక అమెరికన్ జిమ్ లో ఈ పాట ని ప్లే చేస్తూ, అందులోని స్టెప్స్ ని వర్కౌట్స్ లాగ కొంతమందికి చేయిస్తున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. చూస్తూ ఉంటే ఈ పాట #RRR లోని ‘నాటు నాటు’ సాంగ్ లాగా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది.
