టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు సమంత, నాగచైతన్య.. వారిద్దరు దాదాపుగా ఐదేళ్ల పాటు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాలకే ఏదో దిష్టి తగిలినట్లు వారు విడిపోవడం జరిగింది. అసలు ఈ జంట విడిపోవడానికి తగిన కారణం ఏంటో.. వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. సోషల్ మీడియాలో చాలా సార్లు కారణం ఇదే అంటూ పలు ఊహాగానాలు వచ్చినప్పటికీ అవి నిజం కాదని తేలిపోయింది. అంతేకాకుండా కొంతమంది మొదట డివోర్స్ కావాలనుకున్నది చైతూనే అంటూ ప్రచారం చేశారు. మరి కొందరైతే సమంత పై పలు రకాలా రూమర్స్ సైతం సృష్టించారు.

తాజాగా ఇప్పుడు సమంత చైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం ఇదే అంటూ మళ్లీ కొత్త ప్రచారానికి తెరతీశారు. వివరాల్లోకి వెళితే.. సమంతనే మొదట విడాకులు కావాలని కోరిందట. సమంత అమెరికాకి వెళ్లిన టైంలో నాగచైతన్య తల్లిని కలిసిందట. ఆ సమయంలోనే చైతూతో తాను విడిపోవాలనిన కోరుకుంటున్నట్లు అందుకు తగిన రీజన్స్ చెప్పిందని సమాచారం. పెళ్లయిన కొత్తలో అంతా బాగానే ఉన్నా రాను రాను చైతన్య సమంతను కంట్రోల్ చేయడానికి పూనుకున్నాడని డ్రెస్సింగ్.. ఫ్రెండ్స్ విషయంలో కంట్రోల్ చేయాలని నాగచైతన్య అనుకున్నారట. ఈ విషయంలోనే వీరి మధ్య చాలా సార్లు గొడవలు కూడా అయ్యాయట. వీరిద్దరి మధ్య చాలా సార్లు మనస్పర్ధలు గొడవలు కూడా జరిగాయట. అయినా నాగచైతన్య వ్యవహారశైలిలో మార్పు రాకపోవడంతో తన అత్త దగ్గర సమంత వాపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చివరికి విసిగిన సమంత తన లైఫ్ తాను బతికేస్తానని విడాకులు కోరిందని సమాచారం. మరి ఇందులోనైనా నిజం ఎంతుందో తెలియదు గానీ ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
