Ariana : ఫైనల్లీ గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. మంచి జోరు మీద ఉందిగా !

- Advertisement -

Ariana : అరియానా సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్లకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత తనదైన స్ట్రాటజీతో గేమ్ ఆడి కష్టపడి టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత అరియానా.. సోహెల్ పేర్లు ఎలా మార్మోగిపోయాయో తెలిసిందే. అంతేకాదు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ తర్వాత అరియానాకు బోల్డ్ బ్యూటీ అంటూ ట్యాగ్ పెట్టేశారు జనాలు.

ఆ ఇంటర్వ్యూలో ఆర్జీవీ, అరియానా ఎంత పచ్చిగా మాట్లాడుకున్నారో.. అప్పట్లో జనాలు అది విని ఎంత షాక్ తిన్నారో.. ఎప్పటికీ మర్చిపోలేరు. కాగా ఆ తర్వాత పలు ఈవెంట్లు, షోలతో బిజీ బిజీగా మారిపోయింది అరియానా. తాజాగా అమ్మడు వెండితెరపై కూడా కనిపించింది. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే అరియానా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తు్న్న తన సొంతింటి కలను నిజం చేసుకుంటుంది. దానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా ద్వారా షేర్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.

- Advertisement -

దీంతో పలువురు జనాలు ఆమెకు కంగ్రాట్యులేషన్స్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు అరియానా ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడిందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా లేడీ టైగర్ అంటూ ఆమె ట్యాగ్ వేసుకుని బిగ్ బాస్ లో హైలెట్ అయింది. మొత్తానికి ఫైనల్లీ అనుకున్నది సాధించింది ఈ నాజూకు చిన్నది.. రానున్న రోజుల్లో అరియానా తన కెరీర్లో ఎన్ని విజయాలు సాధిస్తుందో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here