Pawan Kalyan : మన టాలీవుడ్ లో ఓపెనింగ్స్ కి కింగ్ ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందరి హీరోలకు ఓపెనింగ్స్ రావాలంటే క్రేజీ కాంబినేషన్స్ ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ చాలా కామెడీ గా రీమేక్ సినిమాలతో ఓపెనింగ్స్ దంచి కొడుతాడు. ఇలా కేవలం స్టార్ స్టేటస్ తో వసూళ్లను కొల్లగొట్టే ఏకైక హీరో ఇండియా లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే.

ఫామ్ లో ఉన్నా లేకపోయినా ఆయన ఓపెనింగ్స్ ని మ్యాచ్ చేసే హీరో ఇప్పటి వరకు రాలేదు. ఉదాహరణకి నిన్న విడుదలైన ప్రభాస్ ‘సలార్’ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ లో రెండేళ్ల క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్ రీమేక్ ‘వకీల్ సాబ్’ చిత్రం ఓపెనింగ్ రికార్డ్స్ ని 90 శాతం సెంటర్స్ లో బ్రేక్ చెయ్యలేకపోయింది. దానికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డ్స్ ని చూసి ఫ్యాన్స్ రీమేక్ సినిమాలకే ఈ రేంజ్ వసూళ్లను రాబడితే, ఇక భవిష్యత్తులో రాబోయే ‘ఓజీ’, ‘హరి హర వీరమల్లు’ లాంటి సినిమాలకు ఇక ఏ రేంజ్ ఓపెనింగ్స్ ని పెడుతాడో, టైం మెషిన్ కానీ ఉంటే ఆరు నెలలు ముందుకు వెళ్లాలని ఉంది అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ట్వీట్స్ వేస్తున్నారు. మరో మూడు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నసందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను చేస్తున్న మూడు సినిమాలను పక్కన పెట్టాడు.

ఎన్నికలు అయిపోయిన తర్వాతనే పవన్ కళ్యాణ్ షూటింగ్స్ ని తిరిగి ప్రారంభించబోతున్నాడు. అయితే ఫ్యాన్స్ దీనిపై కామెంట్ చేస్తే, మళ్ళీ మా ఆలస్యం చేస్తున్నట్టు అనిపిస్తే అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపొండి. షూటింగ్ పూర్తి చేసి తొందరగా మా ముందుకు ‘ఓజీ’ చిత్రాన్ని తీసుకొని రండి అంటూ నిర్మాతలను ట్యాగ్ చేసి డిమాండ్ చేస్తున్నారు.