Bigg Boss : తమిళ బిగ్ బాస్ సీజన్ 7 ఎప్పుడూ లేనంత వేడిగా సాగుతుంది. ఇంట్లోనే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలు కూడా ఇన్వాల్వ్ అవ్వడంతో మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ 7 నుంచి రెడ్ కార్డ్ చూపించి మరీ కమల్ హాసన్… ప్రదీప్ ఆంటోని అనే కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడంతో ఈ రచ్చ మొదలయ్యింది. ప్రదీప్ కి పబ్లిక్ నుంచి ఇండస్ట్రీ వర్గాల నుంచి ఫుల్ సపోర్ట్ వస్తోంది.

వైల్డ్ కార్డ్ తో రీఎంట్రీ ఇచ్చి చూడండి ప్రదీప్ ని ఇప్పటివరకూ మెజారిటీతో గెలిపిస్తాం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్… విజయ్ కుమార్ కూతురు… నటుడు అరుణ్ విజయ్ సిస్టర్ వనిత విజయ్ కుమార్… “నాపై ప్రదీప్ ఆంటోనీ సానుభూతిపరుడు దాడి చేసాడు అంటూ” సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా వెళ్లి బయటకి వచ్చినప్పటి నుంచి ప్రతి సీజన్ కి యూట్యూబ్ లో రివ్యూస్ చేసే వనిత విజయ్ కుమార్ గత రాత్రి ఎపిసోడ్ కంప్లీట్ అయ్యాకా… రివ్యూ చెప్పి… డిన్నర్ చేసి అర్ధరాత్రి 1 గంటకి కార్ పార్కింగ్ వైపు వాకింగ్ చేస్తుంటే.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి “రెడ్ కార్డ్” ఇస్తారా అంటూ దాడి చేసాడట.

ఈ విషయాన్నీ వనిత విజయ్ కుమార్ సోషల్ మీడియాలో గాయాలైన తన ఫోటోతో సహా పోస్ట్ చేసింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంటూ కొంతమంది, ఇందులో నిజం లేదు అంటూ మరికొంతమంది ట్వీట్స్ చేస్తున్నారు. మరి వనిత విజయ్ కుమార్ పోలీసులకి కంప్లైంట్ చేస్తుందో లేదో చూడాలి.