Kajal Aggarwal : హీరోయిన్లు షాపింగ్ మాల్స్, ఈవెంట్స్‌కి వచ్చినప్పుడు అనుకోని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. స్టార్ హీరోయిన్లు అందరూ ఇలాంటి వాటిని ఫేస్ చేశారు. కాబట్టి జన సమూహం ఉండే చోట తెగ ఇబ్బంది పడుతుంటారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రాగా, అక్కడ ఓ అభిమాని వల్ల చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
తెలుగు స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్.. 2020లో గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చింది. ఇక కొడుకు పుట్టిన తర్వాత కొన్నాళ్లకు తిరిగి యాక్టింగ్ మొదలుపెట్టింది. ‘భగవంత్ కేసరి’ చిత్రంతో గతేడాది తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన కాజల్..
ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.10లోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వచ్చింది. ఫ్యాన్స్ చాలామంది వచ్చారు. వాళ్లకు సెల్ఫీలు కూడా ఇచ్చింది. అందరూ బాగానే ఉన్నారు. ఓ తుంటరి అభిమాని మాత్రం కాజల్‌తో ఫొటో దిగుతూ ఆమె నడుముపై చెయ్యేశాడు. దీంతో ఆమె అవాక్కయింది. వెంటనే అతడిని బౌన్సర్లు పక్కకు లాగేశారు. గతంలో కాజల్‌కి ఇలాంటి అనుభవమే ఓసారి ఎదురైంది.