విభిన్నమైన కథలతో సినిమాలు చేసుకుంటూ వెళుతున్న మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లిపై జాతీయ మీడియాలో ఓ వార్త గుప్పుమంది. అందాల భామ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ నిశ్చితార్థం జూన్ లో జరగనుందట. ఈ ఏడాదిలోనే వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. కొన్నాళ్లుగా వీరు జంటగా పార్టీలకు, ఫ్యామిలీ ఫంక్షన్లకు హాజరయ్యారని, అయితే తామిద్దరి మధ్య అనుబంధాన్ని వారు కొట్టిపడేసేవారని ఓ మీడియా సంస్థ వివరించింది. అయితే గత కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి అని, ఆ విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్ ప్రకటిస్తాడు అంటూ చెప్పడం ఈయన పెళ్లి వార్తలకు మరింత బలం చేకూర్చినట్టు అయింది.
ఎప్పటినుండో మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి అంటూ ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ వార్తలకు త్వరలోనే చెక్ పడబోతున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే… త్వరలోనే మెగా ఫ్యామిలీలో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ తాజాగా ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్నాయి.అయితే ఇప్పటికే ఎన్నోసార్లు వరుణ్ తేజ్ పెళ్లి అంటూ వార్తలు వచ్చినప్పటికీ అందులో ఎలాంటి నిజం లేదు. అయితే తాజాగా ఆ హీరోయిన్ తో మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు మీరు అనుకుంటున్న హీరోయినే ఆమెనే లావణ్య త్రిపాఠి.
వరుణ్ తేజ్ ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్లో లావణ్య త్రిపాఠి కనిపించడంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంలో లావణ్య త్రిపాఠి మాత్రం అలాంటిదేమీ లేదు అని క్లారిటీ ఇచ్చింది.కానీ ఎవరైనా సెలబ్రిటీలు వాళ్లు పెళ్లి పీటలు ఎక్కేదాకా వారు చేసుకునే వారి గురించి అస్సలు బయటపెట్టారు. ఇక లావణ్య త్రిపాఠి కూడా అలాగే చేస్తుందని తెలుస్తోంది. లావణ్య త్రిపాఠికి వరుణ్ తేజ్ కి మధ్య ఏదో నడుస్తుందని ఇప్పటికీ ఎన్నో వార్తలు వినిపించాయి.