భోళా శంకర్ సినిమా చూసిన తర్వాత…..మెగా స్టార్ మూవీ ని కూడా రాడ్ మూవీ లాగా తీశాడు అని తిట్టుకోని వారు ఉండరు.ఎంతో హైప్ మధ్య విడుదలైన అభిమాన స్టార్ చిత్రం ఇలా డిసాస్టర్ గా మిగలడం మెగా ఫ్యాన్స్ కి డైజస్ట్ కావడం లేదు. ఒక పక్క మెగా ఫ్యాన్స్ డీలా పడిపోతుంటే…మరోపక్క క్రికెట్ ఫ్యాన్స్ పండక చేసుకుంటున్నారు.
మెహర్ రమేష్ డైరెక్షన్లో డిజాస్టర్ మూవీ వచ్చింది అంటే...ఈసారి వరల్డ్ కప్ మనదే అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రాలు అన్ని డిజాస్టరలే ..కానీ క్రికెట్ మ్యాచ్ ఉన్న టైంలో రిలీజ్ అయితే మాత్రం.. ఇండియన్ టీం గెలిచే ఛాన్స్ ఎక్కువే….మెగా స్టార్ మూవీ పోయి మేం ఏడుస్తుంటే.. ఇదేం సెంటిమెంట్ రా బాబు అనుకుంటున్నారా?
అసలు మాటర్ లోకి వస్తే..2011లో మెహర్ రమేశ్ ఎన్టీఆర్ హీరోగా తీసిన ‘శక్తి’ సినిమా రిలీజైంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ విడుదలైన ఏడాది వరల్డ్‌కప్ భారత్ ఖాతాలో పడింది.1983 తర్వాత తిరిగి 2011లో టీంఇండియా ప్రపంచ ప్రపంచ కప్ గెలుచుకుంది. ఇదే రకంగా 2013లో వెంకటేష్ తో మెహర్ డైరెక్ట్ చేసిన షాడో మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. అదే సంవత్సరం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
తిరిగి ఇప్పుడు ఈ సంవత్సరం వరల్డ్ కప్ జరగబోతోంది అనగా మెహర్ రమేష్ చిత్రం రావడం అది కూడా డిజాస్టర్ గా నిలవడంతో…. ప్రపంచ కప్ భారత్ కు కన్ఫామ్ అని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఇంతకుముందు మెహర్ రమేష్ మ్యాజిక్ వర్క్ అయిన రెండు సార్లు ఇండియన్ టీం కెప్టెన్ గా ధోని వ్యవహరించారు. మరి ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీ కి కూడా మెహర్ రమేష్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా లేదా చూడాలి.