మన అందరికీ తెలిసిందే ఇప్పుడు ట్విట్టర్ ఎంత స్ట్రిక్ట్ అయ్యిందో. ట్విట్టర్ కంపెనీ జాక్ నుండి ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత మొత్తం మారిపోయింది. ఇంతకు ముందు ట్విట్టర్ లో బ్లూ టిక్ మార్క్ ఉంటే ఉన్న అకౌంట్స్ ని సెలెబ్రిటీల అకౌంట్స్ గా పరిగణించేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతీ ఒక్కరు వెయ్యి రూపాయిలు చెల్లించి ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు.

అంతే కాదు ఈ వెరిఫికేషన్ చేయిచుకున్న తర్వాత ఎవరికీ లేని ఫీచర్లు అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఇంతముందు ట్విట్టర్ అంటే పిట్ట గుర్తుకు వచ్చేసి. ఇప్పుడు ఆ లోగో ని కూడా తీసేసి X అనే లోగో ని పెట్టాడు. దీని అర్థం ఏమిటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అంతే కాకుండా కమ్యూనిటీ గైడ్ లైన్స్ కూడా చాలా కఠినం చేశారు. ఏ చిన్న పొరపాటు చేసినా ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయిపోతుంది.

అలా రీసెంట్ సమయం లో ఎంతో మంది సెలెబ్రిటీల అకౌంట్స్ సస్పెండ్ అయ్యాయి. వాటిల్లో ప్రభాస్ ట్విట్టర్ అకౌంట్ కూడా ఒకటి. 18 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్న ఈ ట్విట్టర్ అకౌంట్ ప్రభాస్ ఒరిజినల్ అకౌంట్ కాకపోయినప్పటికీ, ఆయన టీం కి సంబంధించిన వాళ్ళు ఈ అకౌంట్ ని మ్యానేజ్ చేస్తూ ఉంటారు. అయితే ఒకానొక సమయం లో ప్రభాస్ కి సంబంధించి ఒక అద్భుతమైన వీడియో ని అప్లోడ్ చెయ్యగా, ఆ వీడియో లో ఎలివేషన్ కోసం ఉపయోగించుకున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి కాపీ రైట్స్ పడ్డాయి.

అలా చాలా సార్లు కాపీ రైట్స్ పడడం తో , ట్విట్టర్ రూల్స్ ని అతిక్రమించిన అకౌంట్స్ లిస్ట్ లో ప్రభాస్ అకౌంట్ కూడా నిల్చింది. వెంటనే ఆ అకౌంట్ ని సస్పెండ్ చేసారు. తమకి ఉన్న బిగ్గెస్ట్ అకౌంట్ అదేనని, దయచేసి వెనక్కి ఇవ్వాలంటూ ట్విట్టర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాన్ మస్క్ ని ప్రాధేయపడుతున్నారు.