అదృష్టం అంటే శ్రీలీలదే అంటున్నారు టాలీవుడ్ జనాలు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఈ భామ జోరుమీదుంది. వరుసగా అగ్ర హీరోలతో జోడీ కడుతూ కెరీర్లో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఈ భామ చేతిలో దాదాపు ఎనిమిది చిత్రాలున్నాయి. అనతికాలంలో ఈ అమ్మడు తారాపథంలో అగ్ర స్థానానికి చేరుకోవడానికి చాలా అంశాలు ప్లస్ అయ్యాయని చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగులో నాయికల కొరత ఉండటం శ్రీలీలకు బాగా కలిసొచ్చిందని అంటున్నారు.
బెంగళూరులో పుట్టి పెరిగినప్పటికీ శ్రీలీల కుటుంబ నేపథ్యం తెలుగు కావడం కూడా అడ్వాంటేజ్‌గా మారిందంటున్నారు. తెలుగులో చక్కగా డబ్బింగ్ చెప్పడం కూడా శ్రీలీలకు ప్లస్ పాయింట్‌గా మారింది. అంతేకాక డ్యాన్స్ విషయంలో కూడా శ్రీలీల చక్కటి ప్రతిభ కనబరుస్తుంటుంది. ఈ అంశాలన్నీ ఈ భామకు యువతరంలో మంచి క్రేజ్‌ను తీసుకొచ్చాయని, అందుకే వరుస అవకాశాలు వరిస్తున్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం శ్రీలీల..గుంటూరు కారం, భగవంత్ కేసరి, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలతో పాటు విజయ్ దేవరకొండ, నితిన్ సినిమాల్లో నాయికగా నటిస్తున్నది.
ఇక స్టార్ హీరోలూ, యంగ్ హీరోలు ఎవరి సినిమా అయినా సరే, శ్రీలీల మొదటి ఆప్షన్‌గా మారిపోయింది. తన అల్లరి, అందం, ముఖ్యంగా డాన్స్.. అంత పిచ్చ పిచ్చగా నచ్చేస్తున్నాయి. ఇలాంటి శ్రీలీలని డిఫరెంట్ గా చూపించబోతున్నాడు అనిల్ రావిపూడి. ‘నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’ అంటూ సరిలేరు నీకెవ్వరులో ఓ స్లోగన్ వినిపించాడు రావిపూడి. నిజానికి ఆ ట్యాగ్ లైన్ ప్రస్తుతం తాను చేస్తున్న ‘భగవంత్ కేసరి’ చిత్రానికి సరిగ్గా సరిపోతుంది. బాలయ్యకు ఓ ఇమేజ్ ఉంది. అనిల్ రావిపూడికి ఓ బ్రాండ్ ఉంది. ఆ రెండింటికీ భిన్నంగా ‘భగవంత్ కేసరి’ సినిమా రూపుదిద్దుకుంటోంది. టీజర్ ఇటీవలే విడుదలైంది. ఇందులో బాలయ్య గెటప్ గత చిత్రాలతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంది. శ్రీలీల క్యారెక్టర్ కూడా అంతే షాకింగ్ గా ఉండబోతోందట. ఈ కథలోని అసలైన టర్న్‌లూ, ట్విస్టులూ శ్రీలీల పాత్రతోనే ముడి పడి ఉంటాయని, ఈ సినిమాతో శ్రీలీలకు ఓ భిన్నమైన ఇమేజ్ రాబోతోందని తెలుస్తోంది.