Anchor Suma : యాంకర్ సుమ స్పెషల్ గా చేయించుకున్న ఈ డ్రెస్ విలువ ఎన్ని లక్షల్లో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

- Advertisement -

Anchor Suma : బుల్లితెర మీద స్టార్ యాంకర్ గా దశాబ్దాల నుండి కొనసాగుతూ, ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్న యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే అది సుమ అనే చెప్పాలి. ఈమె లేని ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అసలు ఊహించుకోలేము. ఇప్పటికీ ఈమెని రీప్లేస్ చేసే యాంకర్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టలేదు అంటే సుమ స్టాండర్డ్స్ ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గా ఈమె కొడుకు రోషన్ ‘బబుల్ గమ్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చాడు.

ఈ సినిమా దురదృష్టం కొద్దీ మంచి రివ్యూస్ తెచ్చుకున్నా కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. కానీ సుమ కొడుకు కొంతమంది సెలబ్రిటీస్ వారసులు లాగ అలా వచ్చి ఇలా వెళ్లిపోయే రకం కాదు, కుర్రాడిలో టాలెంట్ ఉంది అని విమర్శకులు సైతం ప్రశంసలు అందించారు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ, భవిష్యత్తులో రోషన్ మంచి సక్సెస్ అవుతాడు అని చెప్పొచ్చు.

ఇకపోతే ఈ సినిమా థియేటర్స్ లో సరిగా ఆడకపోయినా కూడా సుమ ప్రొమోషన్స్ ని మాత్రం వదలడం లేదు. రీసెంట్ గా ఆమె ‘బబుల్ గమ్’ పేరుతో ఒక జల్లెడ బ్లాక్ టీ షర్ట్ ని వేసుకొని ఒక ఈవెంట్ కి వచ్చింది. స్టైల్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తూ అందరినీ షాక్ కి గురి చేసింది. ఈమె నిజంగానే సుమ అక్కనేనా అని సోషల్ మీడియా లో ఈ ఫోటోలను చూసి నెటిజెన్స్ కామెంట్స్ చేసారు. అయితే ఆమె వేసుకున్న ఈ జల్లెడ షర్ట్ ని ప్రత్యేకంగా డిజైనర్ తో చేయించుకుంది.

- Advertisement -

దీని విలువ సుమారుగా రెండు లక్షల రూపాయిలు ఉంటుందని టాక్. ఇది తెలుసుకున్న నెటిజెన్స్ సుమ కూడా స్టార్ హీరోయిన్స్ లాగానే కాస్ట్లీ డ్రెస్సులు వెయ్యడం ప్రారంభించింది. తరచూ ఇలాగే ఫొటోస్ అప్లోడ్ చేస్తే బాగుండును, ఇప్పుడు వచ్చిన కుర్ర యాంకర్స్ అందరినీ డామినేట్ చేసేంత గ్లామర్ గా ఉన్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here