హీరోయిన్ ఛార్మీ తో కలిసి పూరీ జగన్నాథ్ నిర్మాణ సంస్థ ప్రారంభించిన తర్వాత వరుసగా ఫ్లాప్స్ అందుకున్నారు. అలాంటి సమయం లో వారికి ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం ఒక వరం లాగ మారింది. కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించింది. కానీ ఆ తర్వాత పూరీ జగన్నాథ్ చేసిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘లైగర్’ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత వెంటనే ఆయన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ ని ప్రకటించి , హీరో రామ్ డేట్స్ తీసుకొని వెంటనే షూటింగ్ ప్రారంభించారు. భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. మరి ఈ సినిమా ఆడియన్స్ ని అలరించిందో లేదో ఈ రివ్యూ లో చూసి తెలుసుకుందాం.
కథ :
ఇస్మార్ట్ శంకర్ చిత్రం లో ఒక చిప్ ద్వారా పోలీస్ ఆఫీస్ బ్రెయిన్ ని హీరో రామ్ బ్రెయిన్ లోకి ఇంజెక్ట్ చేసి ఎలా అయినా పోలీస్ ఆపరేషన్స్ చేసారో, డబుల్ ఇస్మార్ట్ లో కూడా అలా విలన్ సంజయ్ దత్ బ్రెయిన్ ని చిప్ ద్వారా హీరో రామ్ బ్రెయిన్ లోకి ఇంజెక్ట్ చేసి అసాంఘిక కార్యక్రమాలను చేయించుకుంటాడు. అలా చెయ్యడం వల్ల హీరో కి ఎదురైనా సమస్యలు ఏమిటి?, తనని తాను ఈ ఊబిలో నుండి రక్షించుకొని బయటపడి, అసాంఘిక కార్యకలాపాలను ఎలా ఆపాడు అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ :
పూరీ జగన్నాథ్ గత చిత్రం లైగర్ ని చూసి, ఈయన పని పూర్తిగా అయిపోయింది, హీరోలెవరు డేట్స్ ఇవ్వరు అని అనుకున్నారు. అలాంటి సమయంలో హీరో రామ్ రిస్క్ చేసి పూరీ జగన్నాథ్ కి ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం డేట్స్ ఇచ్చాడు. రామ్ పూరీ జగన్నాథ్ పై పెట్టుకున్న నమ్మకాన్ని పూరీ ఒమ్ము చెయ్యలేదు. డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని చాలా చక్కగా, తన మార్క్ టేకింగ్ తో, ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. ముమ్మాటికీ ఈ చిత్రం ‘లైగర్’ కంటే వెయ్యి రెట్లు బాగుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా బాగానే ఉంది కానీ, సినిమాలో కమెడియన్ అలీ ట్రాక్ చూసేందుకు చాలా చీప్ గా అనిపించింది. ఈ ఒక్క కంప్లైంట్ తప్ప, సినిమా మీద మరో కంప్లైంట్ లేదు. సాధ్యమైనంత తొందరగా ఆ ట్రాక్ ని సినిమా నుండి తొలగిస్తే బాగుంటుంది.
ఇక ఈ చిత్రానికి హీరో రామ్ తన ఎనెర్జిటిక్ వన్ మెన్ షో పెర్ఫార్మన్స్ తో దుమ్ము లేపేసాడు అనే చెప్పాలి. బీలో యావరేజి కంటెంట్ ఉన్న సన్నివేశాలను కూడా రామ్ తన యాక్టింగ్ టాలెంట్ తో నిలబెట్టేసాడు. హీరోయిన్ కావ్య థాపర్ చూసేందుకు చాలా చక్కగా ఉంది. నటన కూడా ఈ చిత్రం లో ఆమె అదరగొట్టేసింది. అయితే ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి మణిశర్మ చార్ట్ బస్టర్ ఆల్బం ఇచ్చాడు. ప్రతీ పాట కూడా ఒక రేంజ్ క్లిక్ అయ్యింది. కానీ ‘డబుల్ ఇస్మార్ట్‘ లో కేవలం ఒక్క సూపర్ హిట్ పాటని మాత్రమే అందించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేసాడు. ఇది వింటేజ్ పూరీ జగన్నాథ్ సినిమా అని మాత్రం చెప్పలేము కానీ, ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని నచ్చిన ప్రతీ ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది అని మాత్రం చెప్పగలము.
నటీనటులు : రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ తదితరులు.
సంగీతం : మణిశర్మ
రచన – దర్శకత్వం : పూరి జగన్నాథ్
బ్యానర్ : పూరీ కనెక్ట్స్
చివరి మాట :
ఈరోజు విడుదలైన అన్నీ సినిమాలలో ఇదే బెస్ట్. మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ లాగ ఉంటుంది .
రేటింగ్ : 2.75/5