Double Ismart ఈమధ్య కాలం లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సీక్వెల్స్ ఏ రేంజ్ లో ప్రభంజనం సృష్టిస్తున్నాయో మన అందరికీ తెలిసిందే. కానీ కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కూడా. రీసెంట్ గా విడుదలైన ఇండియన్ 2 చిత్రం అందుకు ఉదాహరణ. ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపే సత్తా ఉన్న సీక్వెల్స్ సిద్దంగానే ఉన్నాయి. అందులో ఇస్మార్ట్ శంకర్ మూవీ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ ఒకటి. గతం లో పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. వరుస ఫ్లాప్స్ లో ఉన్న పూరి జగన్నాథ్, రామ్ కి కం బ్యాక్ మూవీ గా నిల్చింది ఈ చిత్రం.
అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే సాధారణంగానే అంచనాలు భారీగా ఉంటాయి, దానికి తోడు రెండు అదిరిపోయే చార్ట్ బస్టర్ సాంగ్స్ పడితే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కి ఆ రేంజ్ హైప్ ఉంది. ఈ చిత్రం ఆగష్టు 15 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో ని రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో పూరి జగన్నాథ్ కొంతమంది ముఖ్యమైన సినీ ప్రముఖులకు వేసి చూపించారు. వారి నుండి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లైగర్ చిత్రం తో ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకున్న పూరి జగన్నాథ్ కి, ఈ డబుల్ ఇస్మార్ట్ చిత్రం మళ్ళీ పూర్వ వైభవం తెస్తుందని అంటున్నారు.
ఇదే కనుక జరిగితే పూరి జగన్నాథ్ తో స్టార్ హీరోలు మళ్ళీ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం మని శర్మ మ్యూజిక్, హీరో రామ్ ఎనెర్జిటిక్ డ్యాన్స్ మరియు యాక్టింగ్. ఈ సినిమాకి కూడా అవే హైలైట్ గా నిల్చాయట. సంజయ్త్ దత్, రామ్ మధ్య వచ్చే సన్నివేశాలన్నీ అదిరిపోయాయి అని టాక్. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా వేగవంతమైన స్క్రీన్ ప్లే తో, అదిరిపోయే డైలాగ్స్ తో పూరి జగన్నాథ్ ఈ సినిమాని పరుగులు పెట్టించాడట. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.