మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమా పై సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ట్రోల్ల్స్ నడుస్తున్నాయి మనమంత చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కమెడియన్ అలీ ట్రాక్ రాసినందుకు పూరీ జగన్నాథ్ ని ప్రతీ ఒక్కరు తిడుతున్నారు. అది కాసేపు పక్కన పెడితే, ఈ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా రామ్ కి ఉన్న మాస్ క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. మొదటి రోజు ఈ సినిమాతో పాటుగా పోటీగా నాలుగు సినిమాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి 5 కోట్ల రూపాయలకు పైగా మొదటి రోజు షేర్ వసూళ్లు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
కానీ ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 40 కోట్ల రూపాయలకు పైగానే జరిగింది. రెండవ రోజు మార్నింగ్ షోస్ కి వచ్చిన వసూళ్లు చూస్తుంటే ఈ సినిమాకి ఫుల్ రన్ లో కనీసం 15 కోట్ల రూపాయిలైనా వస్తుందా అని ట్రేడ్ పండితులు సందేహ పడుతున్నారు. ఈ సినిమా దెబ్బతో పూరీ జగన్నాథ్ ఇక సినిమాలు మానేయడం పక్కా అని, ఆయన చిత్రాలని డిస్ట్రిబ్యూటర్స్ ఇక కొనబోరని, ‘గాడ్ ఫాదర్’ చిత్రం తో ఎలాగో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి, ఇక నటుడిగానే కొనసాగాలంటూ ఆయనకీ సలహాలు ఇస్తున్నారు అభిమానులు.