టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే అందులో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పేరు ముందు వరుసలో ఉంటుంది. నాలుగు పదుల వయస్సు దాటినా కూడా ఇంకా ఈయన ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. కృష్ణం రాజు బ్రతికి ఉన్నన్ని రోజులు ప్రభాస్ ని పెళ్లి చేసుకోమని చెప్పి చెప్పి విసిగిపోయాడు. ఆ విషయం లో కృష్ణం రాజు కి ఫ్రస్ట్రేషన్ బాగా ఉండేది.
ఇది ఇలా ఉండగా ప్రభాస్ కాజల్ అగర్వాల్ , అనుష్క శెట్టి ఇప్పుడు లేటెస్ట్ గా కృతి సనన్ వంటి వారితో ప్రేమాయణం నడిపి డేటింగ్ కూడా చేసాడని, కాజల్ అగర్వాల్ మరియు అనుష్క శెట్టి తో కుదరలేదని, కానీ ప్రస్తుతం కృతి సనన్ తో మంచి రిలేషన్ మైంటైన్ చేస్తున్నాడని , త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియా లో చాలా కాలం నుండి ఒక రూమర్ ఉంది.
ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ కి పెళ్లి కాకుండానే ఒక కొడుకు ఉండేవాడట అప్పట్లో. కొడుకు అంటే మీరు వేరే అర్థాలు తీసుకొని అపార్థం చేసుకోకండి. ఆయన ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకునే తన కుక్క గురించి మేము చెప్పేది. అప్పట్లో ప్రభాస్ ఒక కుక్కని పెంచుకునేవాడట, ఆ కుక్క మీద ఆయన ఎంతో ప్రేమని పెంచుకున్నాడు, తన సొంత కొడుకు లాగ చూసుకునేవాడట.
అయితే కొంతకాలానికి ఆ కుక్క చనిపోవడం తో ప్రభాస్ ఎంతో మనస్తాపానికి గురి అయ్యాడట. చాలా రోజులు డల్ గా ఎవరితో మాట్లాడకుండా, ఒక రూమ్ లోనే ఉండేవాడట. షూటింగ్స్ లో కూడా పాల్గొనడానికి మూడ్ లేక, చాలా రోజుల వరకు షెడ్యూల్స్ ని వాయిదా వేయించాడట. అలా కొడుకు లాగ పెంచుకున్న కుక్క చనిపోవడం ప్రభాస్ ని ఎంతో కృంగదీసింది. అప్పటి నుండి ఆయన కుక్కల వైపు చూడడం కూడా మానేసాడట, ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.