పవన్ కళ్యాణ్ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తి విషయాలను తెలుసుకోవాలని అభిమానులకు ఉంటుంది. ఆయన గురించి సోషల్ మీడియా లో రోజూ ఎదో ఒక విషయం పై ఫ్యాన్స్ పరిశీలిస్తూనే ఉంటారు. రీసెంట్ గా నాగబాబు ఒక ఇంటర్వ్యూ లో మీరు ఎప్పుడైనా చిరంజీవి , పవన్ కళ్యాణ్ తో కలిసి మందు తాగారా అని అడిగితే ఛీ ఛీ అలాంటిదేమి లేదు, ఎప్పుడైనా ఏదైనా పార్టీలకు కానీ స్నేహితులు ఉన్నప్పుడు వాళ్ళ కోసం మాత్రమే చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ అయినా తాగుతుంటారు.అంతకు మించి వాళ్లకు రెగ్యులర్ గా తాగే అలవాటు లేదు అని చెప్తాడు. ఇది ఇలా ఉండగా, పవన్ కళ్యాణ్ అప్పట్లో రాసిన ఒక స్లామ్ బుక్ లోని తన ఇష్టాయిష్టాలు గురించి చెప్తాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది.

అందులో ‘మీకు బాగా నచ్చిన డ్రింక్ ఏమిటి’ అనే ప్రశ్న ఉంటుంది. దీనికి ఎవరైనా సమాధానంగా మ్యాంగో జ్యూస్ కానీ, పెప్సీ లేదా థమ్స్ అప్ గురించి చెప్తారు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎవ్వరి అంచనాలకు అందకుండా ‘మంచి నీళ్లు’ అని సమాధానం ఇచ్చాడు. ఇది ఆయన వెటకారం గా ఇచ్చాడో, లేదో నిజంగా ఇచ్చాడో తెలియదు కానీ, సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ ఏదైనా మనసులో ఉన్నది ఉన్నట్టు గానే చెప్తాడు కాబట్టి, ఇది నిజమే అని, అందులో ఎలాంటి వ్యంగ్యం కానీ, వెటకారం కానీ లేదని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలు మరో పక్క రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకు ఆయన #OG మూవీ షూటింగ్ లో ఉండగా, గత మూడు రోజుల క్రితమే జనసేన వారాహి యాత్ర ని ప్రారంభించాడు. ఈ నెల 24 వ తారీఖు వరకు ఈ యాత్ర మొదటి విడత కొనసాగనుంది. ఆ తర్వాత 26 వ తారీఖు నుండి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర షూటింగ్ రెండవ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు.