Hanuman : ‘హనుమాన్’ చిత్రం బిజినెస్ లో చిరంజీవి కి ఇంత వాటా ఉందా..!అందుకే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చాడా?

- Advertisement -

Hanuman : ఈ సంక్రాంతికి విడుదల అవ్వబోతున్న సినిమాలలో ఆడియన్స్ ని వైశంగా ఆకర్షిస్తున్న చిత్రాలలో ఒకటి ‘హనుమాన్’. సంక్రాంతికి విడుదల అవుతున్న అన్నీ సినిమాల హీరో కంటే, హనుమాన్ మూవీ హీరో చాలా చిన్నవాడు. అలాంటి వాడి సినిమా కోసం నేడు కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులతో పాటు, ఇండియా మొత్తం ఎదురు చూడడానికి కారణం ఆ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్.

కళ్ళు చెదిరే విజువల్స్ తో, ఇంత తక్కువ బడ్జెట్ తో ఈ రేంజ్ క్వాలిటీ సినిమా తియ్యడం ఎలా సాధ్యం అని ‘హనుమాన్’ ఒక కేస్ స్టడీ లాగ మారబోతుంది. జనవరి 12 వ తారీఖున విడుదల అవ్వబొయ్యే ఈ సినిమా , ప్రమోషనల్ కంటెంట్ లో చూపించినట్టుగానే ఉంటే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎవ్వరూ ఊహించని వసూళ్లు వస్తాయి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మనస్ఫూర్తిగా హీరో తేజ సజ్జల గురించి, అలాగే ‘హనుమాన్’ చిత్రం గురించి, చిన్నప్పుడు నుండి ఆంజనేయ స్వామి తో తనకి ఉన్న సంబంధం గురించి ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మంచి కంటెంట్ ని ప్రోత్సహించడం లో ఎప్పుడూ ముందు హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకడు అని మరోసారి ఈ ‘హనుమాన్’ చిత్రం ద్వారా నిరూపించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి.

- Advertisement -

అయితే ‘హనుమాన్’ సినిమా గత ఏడాది ‘దసరా’ కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమా అప్పటికీ పూర్తి అవ్వలేదు, నిర్మాత నిరంజన్ రెడ్డి దగ్గర అదనపు బడ్జెట్ పెట్టడానికి డబ్బులు లేవు. ఈ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి తనకి తెలిసిన ఫైనాన్షియర్స్ తో ఈ సినిమాకి బడ్జెట్ పెట్టించాడట. అలా మెగాస్టార్ మాట సాయం తో ఈ సినిమా పూర్తి అయ్యింది. కాబట్టి ఈ సినిమా సక్సెస్ సాధిస్తే, ఆ సక్సెస్ క్రెడిట్స్ లో చిరంజీవి కి సింహభాగం ఉంటుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here