ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలు చాలా మంది రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటికే సొనాలి బిందే, హంసా నందిని వంటి వారు క్యాన్సర్ ను జయించారు. సినీ ఫీల్డ్ అంటే ఫిట్ నెస్ బాగుండాలి. అందుకు తగ్గట్లే సెలబ్రిటీలంతా ఆరోగ్యం విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ కొందరు నటీమణులు మాత్రం భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమంతకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిందే. ఎన్నో కష్టాలు పడి విదేశాలకు వెళ్లి అక్కడ సుమారు 8 నెలల పాటు చికిత్స చేయించుకుని బయటపడగలిగింది. అయితే తాజాగా ఇండస్ట్రీలో పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య కూడా ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతోందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఇదే వార్తను అభిమానులు కూడా ప్రచారం చేస్తున్నారు. అల్లు అర్జున్ భార్యకు ఉన్న వ్యాధి ఏంటంటే ఓసీడీ ఉంది. స్నేహా రెడ్డికి కొంచెం దుమ్ము తగిలిన ఆమె తట్టుకోలేదట. అంతేకాదు పుష్ప సినిమా షూటింగ్ కోసం చిత్తూరు అడవుల్లో రెండు నెలల పాటు షూటింగ్ చేసిన అల్లు అర్జున్ ను వారం రోజుల పాటు దూరంగా ఉంచారట. అంతే కాదు కొడుకు కూతురును కూడా దుమ్ముకు చాలా దూరం పెడుతుందట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. పైగా అలాంటి భార్యతో బన్నీ ఎలా నెట్టుకొస్తున్నాడు రా బాబూ..? అంటూ అతడిపై అభిమానులు జాలి చూపిస్తున్నారు. బన్నీ భార్య స్నేహారెడ్డి ఓసీడీ పిచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.