ఆయన మాట్లాడుతూ ‘అమల గర్భం దాల్చిన తర్వాత కొన్ని రోజులు అమెరికా కి వెళ్ళింది. అక్కడ ఆమె గర్భంకి స్కానింగ్ తియ్యగా ఆడపిల్ల పుడుతుందని చెప్పారు. నాకు ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం. నాకు కూతురు పుట్టబోతుందని తెలిసి ఎంతో సంతోషించాను. అమల ని అక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేయించాను. ఇక ఆమె తిరిగి ఇండియా కి వచ్చే సమయంలో, డెలివరీ కి సరిగ్గా రెండు రోజుల సమయం ఉన్న తరుణంలో పుట్టబోయేది ఆడపిల్ల కాదు, మగబిడ్డ అని తెలిసింది. ఆడపిల్ల పుడితే నిఖిత అని పేరు పెడుదాం అనుకున్నాను. కానీ మగబిడ్డ పుట్టేసరికి అఖిల్ అని పెట్టుకున్నాను. ఆడబిడ్డ పుడుతుందని చాలా ఆశలు పెట్టుకున్న నేను మగబిడ్డ పుట్టేసరికి చాలా నిరాశకి గురి అయ్యాను’ అంటూ నాగార్జున ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు ఒకరిద్దరిని కనేందుకు ఆలోచిస్తారు కానీ, మీలాంటి కోటీశ్వరులకు పరిమితి ఏముంటుంది, ఎంతమందిని కనాలి అనుకుంటే అంతమందిని కనొచ్చు కదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాగార్జున ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఆయనకీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్. ఈ చిత్రం తర్వాత ఆయన తమిళ హీరో ధనుష్ తో కలిసి కుబేర అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.