Sindhu Menon : సినిమా అనేది రంగుల ప్రపంచం. దీంట్లోకి అడుగుపెట్టాలని చాలామంది కలలు కంటారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొందరు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతుంటారు. ఒకటి రెండు సినిమాలతోనే ప్రేక్షకులకు దగ్గరైపోతుంటారు. కొన్నేళ్ల పాటు కెరీర్ కొనసాగిస్తుంటారు. మరికొందరు ఉన్నట్లుండి ఇండస్ట్రీ నుంచి మాయం అయిపోతుంటారు. అందులో కొందరు హీరోయిన్స్ పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉండగా.. మరికొందరు సినిమా అవకాశాలు రాక దూరం అవుతుంటారు. అలాంటి వారిలో సింధు మీనన్ ఒకరు. భద్రాచలం సినిమాతో ఎంట్రీ ఇచ్చి చందమామ సినిమాలో మాస్ పాత్ర చేసి ఆకట్టుకుంది సింధూ మీనన్. ఆ తరువాత వైశాలి సినిమాలో తన నటనలో విలక్షణతను చూపించుకుంది ముద్దుగుమ్మ. ఈ మధ్య కొంత కాలంగా ఆమె వెండితెరపై కనబడడం లేదు. చాలా హోమ్లీగా అనుకువగా పక్కింటి అమ్మాయి మాదిరిగా ఉండే సింధు మీనన్ ప్రస్తుతం సినిమాలను పూర్తిగా మానేసింది. ఆమె ప్రస్తుతం ఇండియాలోనే ఉండడం లేదు.
ఈ బ్యూటీ పేరు చెబితే ముందుగా త్రినేత్రం, చందమామ సినిమాలు గుర్తుకు వస్తాయి. బెంగళూరులోని ఒక మలయాళీ కుటుంబంలో జన్మించిన సింధు మీనన్ అక్కడే పెరిగింది. చదువు పూర్తయిన తరువాత ఆమె సినిమాల వైపు అడుగులు వేసింది. 1994లోనే బాల నటిగా కన్నడ సినిమాలో నటించింది. ఈ అమ్మడు దక్షిణాదిన తెలుగు, తమిళ కన్నడ, మలయాళీ చిత్రాల్లో నటించింది. చిన్నప్పటినుండి భారతనాట్యంలో శిక్షణ తీసుకున్న సింధు మీనన్ ఒక డాన్స్ షోలో నాట్యం చేస్తుండగా ఆమెను చూసిన ఒక జడ్జి ఆమెను సినిమా డైరెక్టర్ కి పరిచయం చేశాడు. ఆమెను రష్మీ అనే కన్నడ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తర్వాత మోహన్ లాల్, జయరామ్, మమ్ముట్టి సినిమాల్లో నటించింది. శ్రీహారి హీరోగా నటించిన భద్రాచలం సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాలో చేస్తున్న సమయంలోనే లండన్ కు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడింది.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సింధు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తుంది. ఈ క్రమంలోనే సింధూ మీనన్ కూతురి ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. అందులో అచ్చం తల్లిలాగే అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోస్ వైరలవుతుండగా.. సింధు మీనన్ ఫ్యామిలీని చూసి క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
View this post on Instagram