Guess The Actor ఈ మధ్య సోషల్ మీడియాలో సినీ తారలకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. మొన్నటివరకు హీరోయిన్లకు సంబందించిన ఫోటోలు వైరల్ అవ్వగా.. ఇప్పుడు హీరోలకు సంబందించిన ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. మన స్టార్ హీరోల్లో చాలామంది ఇండస్ట్రీలోకి రాక ముందు నటనలో శిక్షణ తీసుకున్నవారే. ఫ్యామిలీస్ నుంచి వచ్చి స్టార్‌కిడ్స్‌గా చెలామణి అయినప్పటికీ యాక్టింగ్‌లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడ్డవారే ఎక్కువ మంది ఉన్నారు..

కేవలం యాక్టింగే కాకుండా మార్ట్సల్ ఆర్ట్స్‌లోనూ ట్రైనింగ్ తీసుకున్నారు. కరాటే బ్లాక్ బెల్ట్, రెడ్ బెల్ట్ వంటివి నేర్చుకుని మరీ ల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పై ఫొటోలో ఉన్న హీరో కూడా గోల్డెన్ స్పూన్‌తో పుట్టినవారే. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉంది. డబ్బు, పలుకుబడి, పరపతి అన్నీ ఉన్నాయి. కానీ ల మీద మక్కువతో అతను కష్టపడి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఇక టాలీవుడ్‌కు పరిచయమవుతూనే ఓ వరల్డ్ రికార్డును సెట్ చేశారీ ట్యాలెంటెడ్ హీరో. ఒకే రోజు తొమ్మిది లకు సైన్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ స్టార్ హీరోకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు…
ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా.. స్వర్గీయ హీరో నందమూరి తారకరామారావు గారి మనుమడు తారకరత్న.. ఇటీవలే ఈయన గుండె పోటుతో మరణించారు.. ఈక్రమంలో తారకరత్న చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రో బ్యాక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే పై ఫొటో కూడా నెట్టింట్లో దర్శనమిచ్చింది. ఈ ఫొటోలో తారకరత్నకు మార్షల్ ఆర్ట్స్ నేర్పింది ఎవరో తెలుసా? ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ కోచ్ విజయ్ శేఖర్. తారకరత్న మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం తెలియజేశారు.. ఎన్నో సినిమాల్లో నటించాడు.. ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు.. ఆయన మరణం తీరని లోటు.. నీలాంటి వాళ్ళు మళ్ళీ ఇండస్ట్రీకి దొరకరు.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాము..