Devi Puthrudu : విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ వచ్చే విక్టరీ వెంకటేష్, ఎంతో ఇష్టపడి చేసిన ప్రాజెక్ట్ ‘దేవి పుత్రుడు’. కోడి రామ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా 2001 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైంది. భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం ఫ్లాప్ గా నిల్చింది.
ద్వాపర యుగం లో మధుర నగరం సముద్రం లో మునిగిపోవడం, ఆ సముద్ర గర్భం లో దాగి ఉన్న మధుర నగరం నుండి విలువైన ఆభరణాలను దోచుకోవడం కోసం విలన్లు చేసే ప్రయత్నాలను అడ్డుకునే వ్యక్తిగా ఇందులో విక్టరీ వెంకటేష్ కనిపించాడు. మంచి ఆసక్తికరమైన కథనం తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినప్పటికీ, ఎందుకో అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినా కూడా, ఈ సినిమాకి టీవీ టెలికాస్ట్ లో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇకపోతే ఈ సినిమాలో బాలనటిగా నటించిన అమ్మాయి మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ‘ఆ కృష్ణుడు ఏలిన ద్వారకా’ అనే పాటలో ఈ చిన్నారి ఇచ్చే క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ని అంత తేలికగా ఎవరు మర్చిపోగలరు చెప్పండి. ఈ చిన్నారి పేరు ‘వేగా తమోటియా’. ఈమె ఇప్పుడు తమిళం లో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. అలాగే వరుణ్ సందేశ్ హీరో గా నటించిన ‘హ్యాపీ హ్యాపీగా’ అనే చిత్రం లో హీరోయిన్ గా కూడా నటించింది.
ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. ప్రస్తుతం ఉన్న ఆమె లుక్స్ ని చూస్తుంటే ఇప్పుడు ఏ టాలెంట్ లేకపోయినా ఇండస్ట్రీ లో కొనసాగుతున్న కొంతమంది హీరోయిన్స్ కంటే ఎంతో బెటర్ అని అనిపిస్తుంది. కానీ ఎందుకు ఈమెను దర్శక నిర్మాతలు పట్టించుకోవడం లేదు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.