Guess The Actress : ‘మాయలోడు’ చిత్రంలోని ఈ చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు ఎంత హాట్ గా తయారైందో చూస్తే ఆశ్చర్యపోతారు!

- Advertisement -

Guess The Actress మన చిన్నతనం లో ఉన్నప్పుడు మనకి ఎంతో ఇష్టమైన సినిమాలలో కొన్ని క్యారెక్టర్స్ మనకి అలా గుర్తుండిపోతాయి. ఆ క్యారెక్టర్స్ లో మనం ఎక్కువగా చిన్న పిల్లల పాత్రలకు కనెక్ట్ అవుతూ ఉంటాం. అలా మన చిన్నతనం లో ఎంతో ఇష్టపడిన చిత్రాలలో ఒకటి నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, ఎస్వీ కృష్ణా రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ‘మాయలోడు’ అనే చిత్రం. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. కామెడీ తో పాటు చక్కటి ఎమోషన్స్ తో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతీ ఒక్కరు ఎంజాయ్ చేసేలా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడు ఎస్వీ కృష్ణా రెడ్డి. ఇప్పటికీ కూడా టీవీ లో టెలికాస్ట్ అయితే కళ్లప్పగించి అలా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సౌందర్య, కమెడియన్ బాబు మోహన్ తో కలిసి ‘చినుకు చినుకు అందెలతో’ అంటూ సాగే పాట అప్పట్లో ఒక ఊపు ఊపింది.

Guess The Actress
Guess The Actress

అలాగే ఈ చిత్రం అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారకులలో ఒకరైన చిన్నారి బేబీ నిఖిత గురించి మాట్లాడుకోకపోతే ఎలా?. పప్పీ అనే పాత్రతో ఆమె ఎప్పటికీ మర్చిపోలేని విధంగా, అద్భుతంగా నటించింది. ఈ పాప చిన్నప్పుడే అంత ముద్దుగా ఉంది, పెద్దయ్యాక ఎలా ఉంటుందో?, అసలు ఈ పాప ఇప్పుడు ఏమి చేస్తుంది?, సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందా? , లేదా చైల్డ్ ఆర్టిస్టుగా రెండు మూడు సినిమాలతో సరిపెట్టకుండా వంటి సందేహాలు మీలో కలగవచ్చు.

Child Meet Rajendra Prasad Sentiment Scene - Mayalodu

- Advertisement -

అయితే ఈమె నిజంగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళం లో ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ, పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత ఈమెకి బుల్లితెర సీరియల్స్ లో నటించే అవకాశం దక్కింది. తమిళం లో సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది కూడా. ఆమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఒకటి మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. తెలుగు లో ఇప్పటి వరకు ఈమె ఒక్క సినిమాలో కానీ, సీరియల్ లో కానీ నటించలేదు. భవిష్యత్తులో అయినా ఈమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.

മഞ്ഞുരുകും കാലത്തിലെ ജാനിക്കുട്ടി അത്ര പാവമല്ല!!! | Glamour News | Lifestyle | Manorama Online

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here