Actress : ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఈమెకి స్టార్ హీరోలను మించిన క్రేజ్!

- Advertisement -

Actress ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..?, ఆమె తల్లి కూడా ఒక పెద్ద స్టార్ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి తో ఒకప్పుడు ఆడిపాడింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఒక హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ఆమె కూతురిగా, బాలనటిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నారి, తన చక్కటి నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పెద్దయ్యాక మొదటి సినిమాతో ఎవరైనా పాజిటివ్ రోల్ తోనే కనిపించాలని అనుకుంటారు. కానీ ఈమె మొదటి సినిమాలోనే పూర్తి స్థాయి నెగటివ్ రోల్ లో కనిపించింది. అది కూడా మలయాళంలో.

Keerthy Suresh
Keerthy Suresh

ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటించి అతి తక్కువ సమయంలోనే పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతే ఇప్పుడు ఈమెకి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె గురించి ఎన్నో ఉన్నాయి. ఆమె మరెవరో కాదు, కీర్తి సురేష్. ఈమె రామ్ హీరో గా నటించిన ‘నేను శైలజ’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న క్రమంలోనే ఆమెకి ‘మహానటి’ చిత్రంలో నటించే అవకాశం దక్కింది.

Keerthy Suresh in race for Savithri Biopic?

- Advertisement -

సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా, కీర్తి సురేష్ కి నటిగా మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఆమె నటించలేదు, జీవించింది అనే ప్రశంసలు దక్కాయి. అందుకే ఆమెకి నేషనల్ అవార్డు వరించింది. ఈ చిత్రం తర్వాత ఆమె ఎక్కువగా నటనకి అధిక ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ ముందుకెళ్తుంది. రీసెంట్ గా ఆమె కల్కి చిత్రం లో ప్రధాన పాత్రగా నిల్చిన బుజ్జి క్యారక్టర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చింది. కేవలం తెలుగులో మాత్రమే కాదు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో కూడా ఆ పాత్రకి ఈమెనే వాయిస్ ఓవర్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె తమిళం లో మూడు సినిమాలు, హిందీ లో ఒక సినిమా చేస్తుంది. తెలుగు లో ప్రస్తుతం ఆమె ఏ సినిమాకి కూడా సంతకం చెయ్యలేదని టాక్.

Keerthy Suresh to gain weight for Savitri biopic - The Statesman

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here