ఇప్పటి వరకు ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్స్ లో అత్యధిక రేటింగ్స్ దక్కించుకున్న సీజన్ ఏమిటి అంటే అది రెండవ సీజన్ అని కళ్ళు మూసుకొని చెప్పేయొచ్చు. ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరూ చాలా టఫ్ అనే చెప్పాలి. అప్పట్లో వీళ్లంతా ఎక్కువగా కౌశల్ ని టార్గెట్ చెయ్యడం, అతను మీద పాజిటివిటీ రోజురోజుకి పెరిగిపోవడం, చివరికి అతను టైటిల్ గెలవడం వంటివి జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే.

అంతే కాదు ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో సామాన్యులను కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చింది స్టార్ మా టీం. వారిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన కంటెస్టెంట్ గణేష్. ఈ షో తర్వాత ఆయన మళ్ళీ ఎలాంటి షో లో కూడా కనిపించలేదు. అయితే ఇతను చాలా కాలం తర్వాత రీసెంట్ గా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత గణేష్ కి అవకాశాలు చాలానే వచ్చాయి అట. కానీ కౌశల్ ఆర్మీ నెగటివిటీ వల్ల అతనికి అవకాశాలు మొత్తం పోయాయి అట. స్టార్ మా ఛానల్ లో అనేకమైన షోస్ చేసే అవకాశం దక్కిందట, కానీ అతని మీద వచ్చిన నెగటివిటీ ని యూట్యూబ్ కామెంట్స్ లో చూసి స్టార్ మా ఛానల్ వాళ్ళు భయపడ్డారట.

అందుకే తన జీవితం సర్వనాశనం అయ్యిందని , సుమారుగా ఏడాది వరకు ఎలాంటి పని లేకుండా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని గణేష్ చెప్పుకొచ్చాడు. దీనితో గణేష్ ఇంట్లో వాళ్ళు నీకు సినీ రంగం అచ్చి రాదు, దయచేసి అటు వైపు పోకు అని వేడుకునే వారట, దీంతో గణేష్ ఈ రంగానికి దూరంగా జరిగింది వేరే వ్యాపారం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు.
